Shreyas Iyer: దేశవాళీ టోర్నీలో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఊచకోత కోస్తున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి టైటిల్ అందించాడు. అంతకుముందు కేకేఆర్ ని ఛాంపియన్ గా నిలబెట్టాడు. దానికి ముందు వన్డే ప్రపంచ కప్‌లో 113.24 స్ట్రైక్ రేట్ మరియు 66.25 సగటుతో 530 పరుగులతో సత్తా చాటాడు.ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఈ టోర్నీని కూడా కైవసం చేసుకుంటే ఒక క్యాలండర్ ఇయర్లో మూడు టోర్నీలు గెలిచిన కెప్టెన్ గా రికార్డ్ సృష్టిస్తాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ లో ముంబై కర్ణాటక జట్లు తలపడ్డాయి. మిడిల్ అర్దర్లో బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ కేవలం 55 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఇన్నింగ్స్ లో శ్రేయాస్ అయ్యర్ 114 పరుగుల వ్యక్తిగత పరుగులు చేయడంతో ముంబై 4 వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ టార్గెట్ విధించింది. ఇన్నింగ్స్ లో ఆయుష్ మాత్రే 78, హార్దిక్ తమోర్ 84 పరుగులతో సత్తా చాటారు. వీళ్ళతో పాటు శివమ్ దూబే కూడా అద్భుత సహకారం అందించాడు. దూబే 36 బంతుల్లో 63 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇకపోతే ఈ ఏడాది అయ్యర్ అద్భుత ప్రదర్శన కారణంగా పంజాబ్ పండుగ చేసుకుంటుంది. కేకేఆర్ ను వీడిన శ్రేయాస్ పంజాబ్ జట్టులో భాగమయ్యాడు. వచ్చే సీజన్లో అయ్యార్ ని పంజాబ్ కెప్టెన్ గా చేయాలనీ మేనేజ్మెంట్ భావిస్తుంది.
Also Read: Maharashtra Portfolio: మహారాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరీ దగ్గర ఏ శాఖలు ఉన్నాయంటే?
కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అయ్యర్ ఈ ఏడాది సక్సెస్ ఫుల్ గా రాణించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 188.5 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 345 పరుగులు చేసి ముంబైని విజయతీరాలకు చేర్చాడు. రంజీ ట్రోఫీ సీజన్‌లో మొదటి ఐదు మ్యాచ్‌ల్లో 90.4 సగటుతో 452 పరుగులు చేశాడు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ భారత వన్డే జట్టులో మిడిలార్డర్‌లో తన స్థానాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడా లేదా చూడాలి.