ఇండియా మిడిల్‌ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) ఆస్ట్రేలియా A జట్టుతో లక్నోలో జరగబోయే రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌కు ముందు అకస్మాత్తుగా జట్టును వీడటం వార్తల్లో నిలిచేలా చేసింది.. మంగళవారం ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు ముందు రోజు ఆయన ముంబయికి తిరిగి వెళ్ళిపోయారు. బీసీసీఐకి వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆడలేనని తెలిపినట్లు సమాచారం. మొదటి మ్యాచ్‌లో ఉప కెప్టెన్‌గా వ్యవహరించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురేల్ ఇప్పుడు నాయకత్వం చేపట్టనున్నారు. అయితే, అయ్యర్ స్థానంలో ఎవరినీ భర్తీ చేయకపోవడం గమనార్హం.
Sourav Ganguly : మరోసారి క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ
మొదటి టెస్టులో అయ్యర్ బ్యాటింగ్ విఫలమైంది. కేవలం 13 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ కొరీ రోచిచ్చియోలీ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయ్యారు. ఆ నిర్ణయం సరైనది కాదని చాలా మంది భావించారు. అంతకుముందు దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌లో కూడా వెస్ట్‌జోన్ తరఫున 25, 12 పరుగులే చేయగలిగారు. అయినప్పటికీ, రాబోయే వెస్టిండీస్ సిరీస్‌కు ఆయనను పరిగణనలోకి తీసుకోవచ్చని ఎంపికదారులు భావిస్తున్నారు. ఇండియాలో అక్టోబర్ 2 నుంచి జరగబోయే ఈ రెండు టెస్టుల సిరీస్‌లో ఆయనకు అవకాశం లభించే అవకాశం ఉంది.
ఇక జట్టులో మరికొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఖలీల్ అహ్మద్ స్థానంలో పేసర్ మహ్మద్ సిరాజ్ రెండో టెస్టుకు ఎంపికయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితేష్ కుమార్ రెడ్డి మాత్రం మోకాలికి గాయంతో మళ్లీ అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికే మొదటి టెస్టులో ఇరుజట్లు 530 పరుగులకుపైగా చేసి డ్రాగా ముగించుకున్నాయి. రెండో మ్యాచ్ ఫలితం రాబోయే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనుకునే పలువురి ఆటగాళ్లకు కీలకంగా మారనుంది.
