Site icon HashtagU Telugu

Shreyanka Patil: మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి భారతీయురాలు

Shreyanka Patil

Indiatv 2023 07 01t092850 1688183944

Shreyanka Patil: 20 ఏళ్ల టీమిండియా ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంకా పాటిల్‌ చరిత్ర సృష్టించింది. ఆమె త్వరలోనే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొననుంది.  మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆగస్టు 31న ప్రారంభం కానుంది మరియు టోర్నమెంట్ చివరి మ్యాచ్ సెప్టెంబర్ 10న జరగనుంది. శ్రేయాంక అమెజాన్ వారియర్స్ జట్టుకు సారథ్యం వహిస్తుంది

శ్రేయాంక పాటిల్ ఇటీవల ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన పేరిట మొత్తం 9 వికెట్లు పడగొట్టి జట్టును చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో తొలిసారిగా శ్రేయాంక పాటిల్ పేరు వెలుగులోకి వచ్చింది.

మహిళల కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆగస్టు 31న ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీ మొత్తం 11 రోజుల పాటు జరగనుండగా, మూడు జట్లు కలిసి మొత్తం 7 మ్యాచ్‌లు ఆడనున్నాయి. బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్ మరియు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మూడు జట్ల మధ్య ఈ ఏడు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీలో వెస్టిండీస్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొననున్నారు.

Read More: Hyderabad Metro: విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన హైద‌రాబాద్ మెట్రో.. ఇందుకోసం కొత్త స్మార్ట్ కార్డు