Site icon HashtagU Telugu

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ కు షాక్.. రోహిత్ శర్మ ఐఫోన్ చోరీ!

Rohit Sharma

Rohit sHarma

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐఫోన్ రాజ్‌కోట్‌లో చోరీకి గురైంది. గత బుధవారం రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు చివరి వన్డే ఆడింది. ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ ఆ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు రోహిత్ ఐఫోన్ మాయమైనట్లు వార్తలు వచ్చాయి. ఆ సమావేశం తర్వాత రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్‌కు బయలుదేరాడు. భారత జట్టు శిక్షణలో ఉండగా, రోహిత్ తన ఐఫోన్ తప్పిపోయిందని గ్రహించాడు. వెంటనే రాజ్‌కోట్‌ స్టేడియం నిర్వాహకులకు సమాచారం అందించారు. ఫిర్యాదు చేయకపోయినప్పటికినీ, పోలీసుల సాయంతో సోదాలు చేస్తున్నారు.

ఫోన్ స్విచ్ ఆఫ్ కాకముందే రాజ్‌కోట్‌లోని రింగ్‌రోడ్డుపై ఉన్నట్టు ట్రేసింగ్ స్పష్టమైంది. తర్వాత ఫోన్ ఎక్కడికెళ్లిందో ఆచూకీ లభించలేదు. రోహిత్ శర్మ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ, పోలీసులు రంగంలోకి దిగారు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మరియు స్థానిక అధికారులు ఫోన్‌ను ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అచూకీ లభించలేదు.

రాజ్‌కోట్‌లోని నివేదికల ప్రకారం.. ఫోన్ దొంగల ముఠా ఉంది ఈ ప్రాంతంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఇతర పండుగల సమయంలో ఫోన్లు చోరీకి గురవుతున్నాయని చాలామంది ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు భారత కెప్టెన్ ఫోన్ కనిపించకుండా పోవడంతో అక్కడి అధికారులకు ఇబ్బంది ఏర్పడింది.

Also Read: Congress Strategy: కాంగ్రెస్ పొలిటికల్ స్కెచ్, ఎన్నికల బరిలోకి గద్దర్ ఫ్యామిలీ