Divorce Rumours: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మధ్య విడాకుల వార్తలు (Divorce Rumours) మరోసారి మొదలయ్యాయి. ఈసారి షోయబ్ మాలిక్ స్వయంగా ఈ వార్తలను ప్రచారం చేశారు. దీనికి కొన్ని నెలల ముందు కూడా వారి విడాకుల వార్తలు సర్వసాధారణం అయ్యాయి. తాజాగా షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పెద్ద మార్పు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో చేసిన మార్పే ఈ ఊహాగానాలకు దారి తీశాయి.
ఇటీవల షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను మార్చాడు. గతంలో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను ప్రొఫైల్ పెట్టుకున్నాడు. కానీ ఆ ఫోటోను తొలగించి తన ఫోటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు మాలిక్. ఇన్‌స్టాగ్రామ్ బయోను కూడా మార్చాడు. గతంలో షోయబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ భర్త అని ఉండేది. అయితే ఇప్పుడు దానిని తన బయో నుంచి తొలగించి కేవలం తన వ్యక్తిగత సమాచారాన్ని రాసుకున్నాడు. ఈ మార్పుల తర్వాత వీరిద్దరి మధ్య మరోసారి విడాకుల వార్తలు రావడం మొదలయ్యాయి.
https://twitter.com/aimansohaill/status/1686715910063587328?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1686715910063587328%7Ctwgr%5E0975e94afc6391eaad8281c7e942dfcefbf0adf2%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fstatic.asianetnews.com%2Ftwitter-iframe%2Fshow.html%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Faimansohaill%2Fstatus%2F1686715910063587328%3Fref_src%3Dtwsrc5Etfw
అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు పలు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. దీనికి సంబంధించి షోయబ్, సానియాల తరఫున ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. షోయబ్ మాలిక్ సానియా మీర్జాను మోసం చేశాడని గతంలో వార్తలు వచ్చాయి. పాకిస్థానీ నటి అయేషా ఉమర్‌తో మాలిక్ ఎఫైర్ నడుపుతున్నాడని వార్తలు వ్యాపించాయి. షోయబ్, అయేషా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వైరల్ చిత్రాల గురించి నటి అయేషా మాట్లాడుతూ.. ఇవి ఒక ప్రకటన కోసం తీసిన చిత్రాలు మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఎఫైర్ వార్తలను కొట్టిపారేసింది. ఈ పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో సానియా, షోయబ్‌ల కొత్త టాక్ షో ‘ది మీర్జా మాలిక్ షో’ రావడంతో ఆ ఊహాగానాలన్నింటికీ తెరపడింది.
Also Read: Record Rainfall: చైనాను వణికిస్తున్న తుఫాను.. 140 ఏళ్ళ రికార్డు బ్రేక్..!
2010లో పెళ్లి
సానియా, షోయబ్ మాలిక్ 2010లో వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇద్దరూ దాదాపు 5 నెలల పాటు డేటింగ్‌లో ఉన్నారు. వివాహమైన చాలా కాలం తర్వాత అక్టోబర్ 30, 2018న షోయబ్- సానియాకు కొడుకు పుట్టాడు. షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకునే ముందు సానియా మీర్జా తన చిన్ననాటి స్నేహితుడు సోహ్రాబ్‌తో నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల సోహ్రాబ్-సానియాల నిశ్చితార్థం రద్దయిన విషయం తెలిసిందే.