Site icon HashtagU Telugu

Shoaib Akhtar: విరాట్ కోహ్లీని పొగిడిన షోయబ్ అక్తర్.. దీని వెనుక అదే కారణం ఉందా?

Whatsapp Image 2023 03 05 At 17.59.56

Whatsapp Image 2023 03 05 At 17.59.56

Shoaib Akhtar: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక దాదాపు మూడేళ్ల తర్వాత కొట్టి క్రేజ్ సంపాదించుకున్నాడు. గత ఏడాది ఆసియా కప్ నుంచి కివీస్ వన్డే సిరీస్ వరకు అద్భుతంగా ఆడాడు. అలా 34 ఏళ్ల వయసులో ఇంత మంచి ఫామ్ సంపాదించుకోవడం అనేది అసాధారణం అంటూ క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక అందరూ విరాట్ ను పొగడ్తతో మరింత పైకి తీసుకెళ్తున్నారు.

అయితే తాజాగా మాజీ ఫెసర్ షోయబ్ అక్తర్ కూడా విరాట్ ను పొగిడాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని నమ్ముతానంటూ.. కానీ కెప్టెన్ గా మాత్రం అతడు విఫలమయ్యాడు అంటూ కామెంట్ చేశాడు. దాంతో సారధ్య బాధ్యతలనే వదిలేశాడు అని అన్నాడు. ఇక తన స్నేహితుడు విరాట్ గురించి మాట్లాడటం చాలా ఇష్టం అంటూ.. అతని విషయంలో కూడా ఇలాగే జరిగింది అంటూ కామెంట్ చేశాడు.

ఎప్పుడైతే కెప్టెన్సీ భారం లేకుండా స్వేచ్ఛ మొదలుపెట్టాడో అప్పుడే ఫామ్ లోకి వచ్చేసాడు అని.. అందుకు గత టీ20 ప్రపంచ కప్ లో అతని ప్రదర్శన చూస్తే అర్థమయిపోతుంది అని అన్నాడు. ఇక విరాట్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడని చెప్పడానికే ఆ టోర్నమెంట్ అక్కరకు వచ్చేలా ఆ దేవుడు చేశాడు అని.. ఇక చాలామంది తనను విరాట్ కోహ్లీని ఎందుకు పొగుడుతుంటావు అని ప్రశ్నిస్తూ ఉంటారు అని.. దాంతో నేనెందుకు మర్చిపోకూడదు అని తిరిగి వారిని అడుగుతాను అని అన్నాడు.

ఒక్కసారి విరాట్ రికార్డులు గమనించండి అంటూ.. అతడు సాధించిన సెంచరీలో 40 కి పైగా చేదన సమయంలోనే చేశాడు.. ఒకానొక దశలో భారత్ విజయం సాధించటంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు అని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు చూసి దీని వెనుక ఏదైనా కారణం ఉందా అంటూ అనుమానం పడుతున్నారు.