Shivam Dubey- Yashasvi Jaiswal: ఈ ఇద్ద‌రి ఆట‌గాళ్ల‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ జ‌ట్టులో చోటు ఖాయ‌మేనా..?

T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ఇంకా 4 నెలలు మిగిలి ఉన్నాయి. రాబోయే టోర్నమెంట్‌లో మిడిల్ ఆర్డర్ ఆల్ రౌండర్ శివమ్ దూబే, యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌ (Shivam Dubey- Yashasvi Jaiswal)లకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Shivam Dubey- Yashasvi Jaiswal

Safeimagekit Resized Img (2) 11zon

Shivam Dubey- Yashasvi Jaiswal: T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ఇంకా 4 నెలలు మిగిలి ఉన్నాయి. అయితే టోర్నమెంట్‌లో పాల్గొనే ఆటగాళ్ల పేర్లు ఇప్పటికే చర్చించబడ్డాయి. రాబోయే టోర్నమెంట్‌లో మిడిల్ ఆర్డర్ ఆల్ రౌండర్ శివమ్ దూబే, యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌ (Shivam Dubey- Yashasvi Jaiswal)లకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. కారణం వారిద్ద‌రూ ప్ర‌స్తుతం టీ20ల్లో అద్భుతంగా రాణించ‌ట‌మే. ఈ ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ ఇద్ద‌రూ ఆడిన రెండు మ్యాచ్‌లోనూ త‌మ ప్ర‌తిభ‌ను చూపారు. దూబే వేరే లెవెల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా రెండు తొలి విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా బౌలింగ్‌లోనూ రాణిస్తున్నాడు

శిఖర్ ధావన్ జట్టుకు దూరమైన తర్వాత భారత్‌కు చాలా కాలంగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అవసరం ఏర్పడింది. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చూస్తుంటే టీమ్ ఇండియా అన్వేషణ పూర్తయినట్లే అనిపిస్తోంది. 22 ఏళ్ల జైస్వాల్ భారత జట్టులో నిరంతరం మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో త‌న‌దైన శైలిలో రాణించాడు. జట్టుకు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అతను కేవలం 34 బంతుల్లో 68 పరుగులతో అర్ధ సెంచరీ చేశాడు.

Also Read: Virat Kohli Visit Ram Temple: విరాట్-అనుష్క దంపతులకు అయోధ్య ఆహ్వానం.. కోహ్లీకి బీసీసీఐ ప‌ర్మిష‌న్ ఇస్తుందా..?

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. జైస్వాల్, దూబేల అద్భుతమైన ఆటను పరిగణనలోకి తీసుకుంటే వారికి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కూడా స్థానం కల్పించాలని బోర్డు ఆలోచిస్తోంది. బీసీసీఐ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. దూబేపై టీమ్ మేనేజ్‌మెంట్, భారత సెలెక్టర్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దూబే వీలైనంత ఎక్కువ బౌలింగ్ చేయాలని వారు కోరుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇది జట్టులో ఆటగాడిగా అతని ప్రాముఖ్యతను బాగా పెంచుతుందని స‌మాచారం.

జైస్వాల్, దూబే T20 అంతర్జాతీయ క్రికెట్ కెరీర్

యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున మొత్తం 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ స‌మ‌యంలో తన బ్యాటింగ్‌తో 15 ఇన్నింగ్స్‌లలో 35.57 సగటుతో 498 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో జైస్వాల్‌ పేరిట ఒక సెంచరీ, నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. శివమ్ దూబే ఇప్పటివరకు భారత జట్టు తరఫున మొత్తం 20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ఈ స‌మ‌యంలో తన బ్యాటింగ్‌తో 13 ఇన్నింగ్స్‌లలో 45.83 సగటుతో 275 పరుగులు చేశాడు. బౌలింగ్ చేస్తూ 8 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 17 Jan 2024, 10:23 AM IST