IPL Record: ఊతప్ప- దూబే సెన్సేషనల్ రికార్డ్

ఆధ్యంతం ఆసక్తిగా సాగిన చెన్నై, బెంగుళూరు మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఇవన్నీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల పేరిట నమోదయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Csk Imresizer

Csk Imresizer

ఆధ్యంతం ఆసక్తిగా సాగిన చెన్నై, బెంగుళూరు మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఇవన్నీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల పేరిట నమోదయ్యాయి. అయితే ఈ మ్యాచ్ లో రాబిన్ ఊతప్ప, శివమ్‌ దూబే జోడీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఊతప్ప, శివమ్‌ దూబే జంట 165 పరుగుల సాధించగా.. అంతకుముందు షేన్‌ వాట్సన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ జోడి ఐపిఎల్ 2020 సీజన్ లో పంజాబ్‌ కింగ్స్‌పై, 181 పరుగుల భాగస్వామ్యం సాధించారు.. అలాగే ఐపీఎల్ 2011 సీజన్ లో మురళీ విజయ్‌- మైక్‌ హస్సీ జోడి ఆర్‌సీబీపై 159 పరుగుల భాగస్వామ్యం సాధించారు.

అలాగే ఐపీఎల్ లో 11 నుంచి 20 ఓవర్ల మధ్యలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు 11 నుంచి 20 ఓవర్ల మధ్యలో 156 పరుగులు చేసింది. అంతకుముందు ఆర్‌సీబీ 2016లో గుజరాత్‌ లయన్స్‌పై 172 పరుగులు చేయగా, పంజాబ్‌ కింగ్స్‌ చెన్నై సూపర్ కింగ్స్ పై 2014లో 162 పరుగులు సాధించింది.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు శివమ్ దూబె 46 బంతుల్లో 5ఫోర్లు, 8సిక్సుల సాయంతో 95 పరుగులు, రాబిన్ ఉతప్ప 50 బంతుల్లో 4ఫోర్లు 9 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేయడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆ తర్వాత చెదనకు దిగిన ఆర్సీబీ జట్టు ఆఖరికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  Last Updated: 13 Apr 2022, 09:48 AM IST