Site icon HashtagU Telugu

Sanju Samson: సంజు “గ్రేట్ స్పీచ్” .. హెట్ మైర్ కు థ్యాంక్స్.. నవ్వులు పూయిస్తున్న వీడియో!!

Rajasthan Royals

Rajasthan Royals

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు రన్నర్ గా నిలిచింది. ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ టీమ్ సభ్యులతో జరిగిన మీటింగ్ లో కెప్టెన్ సంజు శామ్సన్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారింది. మీటింగ్ కు హాజరైన టీమ్ సభ్యుల వైపు చూస్తూ సంజు స్పీచ్ ఇచ్చారు.

“మా టీమ్ డైరెక్టర్ సంగక్కర కు ధన్యవాదాలు. ఆయన చేసిన దిశానిర్దేశం వల్లే మా టీమ్ ఈసారి ఫైనల్ దాకా వచ్చింది. షిమ్రాన్ హెట్ మైర్ కు కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఈ గొప్ప ప్రసంగం చేస్తుండగా, అతడు తినడంలో నిమగ్నమయ్యారు” అని సంజు చెప్పగానే అందరూ నవ్వారు. ఒక్కసారిగా షిమ్రాన్ హెట్ మైర్ వైపు తిరిగి చూశారు. అప్పుడు హెట్ మైర్ చూపిన హావభావాలు నవ్వుల పువ్వులు పూయించాయి. ఇందుకు సంబంధించి గురువారం రాజస్థాన్ రాయల్స్ టీమ్ ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.