Site icon HashtagU Telugu

PBKS vs RR: హెట్మెయర్ మెరుపులు.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు

PBKS vs RR

PBKS vs RR

PBKS vs RR: ఐపీఎల్ 27 మ్యాచ్లో భాగంగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ లో షిమ్రాన్ హెట్మెయర్ 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ , 3 సిక్సర్లతో 27పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా విజయం కోసం పోరాడిన పంజాబ్ కు మరోసారి నిరాశే మిగిలింది.

గత మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఓడిపోయాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. రాజస్థాన్ గత మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓటమి మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్, పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్ భీకరంగా సాగింది.. ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ ఆది నుంచే ప్రేక్షకుల్ని టెన్షన్ పెట్టించింది. అయితే పంజాబ్ భారీ స్కోర్ చేయకపోవడంతో రాజస్థాన్ సునాయాసంగా విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ మరో బంతి మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి సాధించింది. జట్టు తరపున, యశస్వి జైస్వాల్ 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లలో షిమ్రోన్ హెట్మెయర్ 27 పరుగులతో జట్టుని విజయతీరాలకు చేర్చాడు.

అంతకుముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్‌కు ఆరంభం దక్కలేదు. దీంతో ఆ జట్టు 102 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ తరఫున అశుతోష్ శర్మ 16 బంతుల్లో 31 పరుగులు చేసి అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. కేశవ్, అవేశ్ చెరో రెండు వికెట్లు తీశారు. మిగిలిన ముగ్గురు బౌలర్లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ సీజన్లో రాజస్థాన్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ ఈ సీజన్‌లో నాలుగో ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంది.

We’re now on WhatsAppClick to Join

పంజాబ్ కింగ్స్ జట్టు: అథర్వ తైడే, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.

రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజు శాంసన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, తనుష్ కోటియన్, ట్రెంట్ బౌల్ట్, కేశవ్ మహరాజ్, అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్.

Also Read: Attack On CM Jagan : ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ – టీడీపీ

Exit mobile version