Shikhar Dhawan: కోహ్లీ సీక్రెట్స్ ని రివీల్ చేసిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కింగ్ కోహ్లీ తన అసాధారణ ప్రదర్శనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లతో పాటుగా యంగ్ క్రికెటర్లకు కోహ్లీ రోల్ మోడల్ గా నిలిచాడు

Published By: HashtagU Telugu Desk
Shikhar Dhawan

Shikhar Dhawan

Shikhar Dhawan: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కింగ్ కోహ్లీ తన అసాధారణ ప్రదర్శనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లతో పాటుగా యంగ్ క్రికెటర్లకు కోహ్లీ రోల్ మోడల్ గా నిలిచాడు. కోహ్లీ ఆటతీరును మెచ్చుకోని ఆటగాడు ఉండడంటే అతిశయోక్తి కాదు.

ఐపీఎల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కింగ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ క్రికెటర్ గా జేజేలు పలికించుకున్నాడు .టెస్ట్, వన్డే, టి20 ఇలా ఫార్మేట్ ఏదైనా రికార్డుల్ని నెలకొల్పడమే పనిగా పెట్టుకునే కోహ్లీని చూసి మాజీలు ముచ్చటపడుతుంటారు. విదేశీ ఆటగాళ్లు సైతం కోహ్లీ ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేరు. అయితే కోహ్లీ సీక్రెట్స్ పై ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటారు. తాజాగా కోహ్లీ సీక్రెట్స్ ని రివీల్ చేశాడు టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్.

విరాట్ కోహ్లీ గొప్ప సంకల్పంతో ముందుకెళతాడు. ఏదైనా సాధించాలని పట్టుపడితే వదలడు. కోహ్లీకి ఆత్మ విశ్వాసం ఎక్కువ. తనపై అపారమైన నమ్మకమే ఓ శక్తిగా మారి కోహ్లీని ముందుకు నడిపిస్తోంది. అదే విరాట్ సక్సెస్ కు కారణమని ధావన్ పేర్కొన్నాడు అందుకే కోహ్లీని ప్రతి ఆటగాడు మెచ్చుకుంటాడు. టీమిండియా దిగ్గజం గంగూలీ సైతం కోహ్లీ ఆట చూడటం తన అదృష్టంగా భావిస్తాడు. ఇతరుల సంగతి పక్కనపెడితే కోహ్లీ సక్సెస్ సీక్రెట్ ఏంటో తన మాటల్లోనే చూద్దాం. సక్సెస్ కి సీక్రెట్స్ అంటూ ఏం లేవు, కఠోర శ్రమే బలమంటున్నాడు కోహ్లీ. హార్డ్ వర్క్‌తో పాటు ఆటపై దృష్టి కేంద్రీకరిస్తే ఏదైనా సాధించవచ్చు. మీపై మీరు నమ్మకం ఉంచి పని చేస్తూనే ఉంటే ప్రతి ఒక్కరికి మంచిరోజు వస్తుందని బలంగా నమ్మే వ్యక్తి మన కింగ్. అండర్ 19 కెప్టెన్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా నిలిచేవరకు కోహ్లీ ఫిట్‌నెస్‌ను ఏ రోజు నిర్లక్ష్యం చేయలేదు. కోహ్లీ సక్సెస్ సీక్రెట్స్ లో తన ఫిట్నెస్ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.

Also Read: Karnataka: టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పులతో పూలమాల

  Last Updated: 31 Jan 2024, 05:58 PM IST