Site icon HashtagU Telugu

Shikhar Dhawan : కెప్టెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శిఖర్ ధావన్…దేశం కన్నా ముఖ్యం కాదు..!!

Shikhar Dhawan

Shikhar Dhawan

BCCI తీసుకునే నిర్ణయాలు ఎవరికీ అంతుపట్టవు. ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. బీసీసీఐ కాస్తా బీజేపీపార్టీ ఆఫీసుగా మారిందన్న ఆరోపణలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ఇంకోవైపు సోషల్ మీడియాలో కేరళ స్టార్ సంజూ శాంసన్ ఆటలో తన సత్తా చూపిస్తున్నప్పటికీ…సత్తా చాటని రిషబ్ పంత్ ను సెలక్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిఖర్ ధావన్ ను న్యూజిలాండ్ టూర్ లో వన్డే జట్టు కెప్టెన్ గా సెలక్ట్ చేసింది.

దీనిపై స్పందించారు శిఖర్ ధావన్. తాను జట్టులో ఆటగాడిగా ఉండేందుకు సంతోషపడతానని, కానీ కెప్టెన్సీ పోయిందన్న బాధ లేదన్నారు. దేశం కోసం ఆడాలన్న తపన ఉందన్నారు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. గతంలో ఎన్నో మ్యాచుల్లో నా వంతు పాత్రను సరిగ్గా పోషించాను. కానీ కెప్టెన్సీ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ధావన్ను  కెప్టెన్ గా ఎంపిక  చేసింది బీసీసీఐ.