Punjab Solid Win: రాణించిన శిఖర్ ధావన్…గుజరాత్ కు షాక్…పంజాబ్ ఘన విజయం..!!

IPL2022లో అద్భుత విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్ రెండవ ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ లెవన్ చేతిలో పరాజయం పొందింది.

Published By: HashtagU Telugu Desk
Dhawan Imresizer

Dhawan Imresizer

IPL2022లో అద్భుత విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్ రెండవ ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ లెవన్ చేతిలో పరాజయం పొందింది. మరో నాలుగు ఓవర్లు ఉండగానే పంజాబ్ విజయం సాధించింది. మంగళవారం జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ నుంచి సాయి సుదర్శన్ 64 పరుగులు తప్పా మరెవరూ ఆడలేకపోయారు. రబడ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ విలవిల్లాడింది. రబడ రెండు వరస బంతుల్లో రాహుల్ తెవాటియా రషీద్ ఖాన్ వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ మూడవ ఓవర్లోనే తొలి వికేట్ శుభమన్ గిల్ అవుట్ కాగా నాలుగవ ఓవర్ కు రెండవ వికెట్ కోల్పోయింది. ఎడవ ఓవర్ కు మూడో వికెట్ కోల్పోయింది.

144 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ లెవన్ ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ..ఆ తర్వాత నిలదొక్కుకుంది. ముఖ్యంగా శిఖర్ ధావన్ మంచి ఆటతీరు కనబర్చారు. దీంతో పంజాబ్ కింగ్స్ లెవన్ 16 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సీజన్ లో వరస విజయాలు సాధిస్తున్న గుజరాత్ కు బ్రేక్ వేసింది. ఒకానొక దశలో అంటే చివర్లో 30 బంతుల్లో 27 పరుగులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమమంలో అంటే ఇన్నింగ్స్ 16వ ఓవర్ మొహమ్మద్ షమీ వేశాడు. స్ట్రైకింగ్ ముగింపులోఉన్న లివింగ్ స్టోన్ ఒక్కసారిగా చెలరేగాడు. వరుసగా 3 సిక్సర్లు, 2 బౌండరీలతో అదే ఓవర్ లో విజయం అందించాడు. శిఖర్ ధావన్ 52 పరుగులతో లివింగ్ స్టోన్ 30 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. పంజాబ్ ఇప్పటివరకూ పది మ్యాచ్ లు ఆడింది. ఐదింటిని గెలిచి…మరో ఐదింటిని ఓడింది. పది పాయింట్లు గెల్చుకుని పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది.

Pic Courtesy- BCCI/Twitter

  Last Updated: 04 May 2022, 12:22 AM IST