Site icon HashtagU Telugu

Shikhar Dhawan: ధావన్ రికార్డుల మోత

shikhar dhawan

shikhar dhawan

ఐపీఎల్ 15వ సీజన్‌ లో వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ పలు రికార్డులను అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతున్న ఈ మ్యాచ్ ఐపీఎల్‌లో శిఖర్ ధావన్‌కి 200వ మ్యాచ్ కావడం విశేషం. ఈ జాబితాలో ధావన్ కంటే ముందు ఎంఎస్ ధోని , దినేష్ కార్తీక్ , రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. అలాగే ఐపీఎల్ లో 6402 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ తర్వాత 6000 పరుగులు సాధించిన రెండో క్రికెటర్ గా శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు.

అలాగే టీ20 ఫార్మాట్ లో 9000 పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో టీమిండియా ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో ధావన్ కంటే ముందు విరాట్ కోహ్లీ కోహ్లీ 10392 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 10009 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్ ద్వారా శిఖర్ ధావన్ చెన్నై సూపర్ కింగ్స్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చెన్నైపై 28మ్యాచ్‌లలో 949పరుగులు చేసిన విరాట్ కోహ్లీని వెనక్కినెట్టాడు. కాగా ధావన్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 302పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానానికి చేరుకున్నాడు. మరో వైపు రోహిత్, కోహ్లీ తమ ఫామ్‌ లేమితో సతమతమవుతుండగా.. గబ్బర్ తన పరుగుల వరదను కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో పంజాబ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.