Shikhar Dhawan: విడాకులపై ఓపెన్ అయిన శిఖర్ ధావన్.. ఆసక్తికర కామెంట్స్..!

భారత జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన నిష్కళంకమైన శైలితో మనకు తెలుసు. క్రికెట్ ఫీల్డ్‌లో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా అతను తన జీవితాన్ని బహిరంగంగా గడపడానికి ఇష్టపడతాడు. అయితే ఈ రెండు చోట్లా కష్టకాలం నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 12:36 PM IST

భారత జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన నిష్కళంకమైన శైలితో మనకు తెలుసు. క్రికెట్ ఫీల్డ్‌లో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా అతను తన జీవితాన్ని బహిరంగంగా గడపడానికి ఇష్టపడతాడు. అయితే ఈ రెండు చోట్లా కష్టకాలం నడుస్తోంది. ఓ వైపు టీమ్ ఇండియా నుంచి బయటకు వెళ్లిపోతూనే మరోవైపు భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)కి టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. గత ఏడాది బంగ్లాదేశ్ పర్యటన తర్వాత శిఖర్‌ను టీమ్ ఇండియా నుండి తొలగించారు. ఇటువంటి పరిస్థితిలో అతను ఐపిఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి మళ్లీ తిరిగి రావాలనుకుంటున్నాడు. అయితే తాజాగా అతను ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

ఈ సందర్భంగా శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడాడు. సెప్టెంబర్ 2021లో శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో భార్య అయేషా ముఖర్జీతో ఉన్న తొమ్మిదేళ్ల బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోంది. పెళ్లి చెడిపోవడానికి తానే కారణమని, పెళ్లి సమయంలో ఈ రంగంపై తనకు పూర్తి అవగాహన లేదని ధావన్ చెప్పాడు.

శిఖర్ ధావన్ మాట్లాడుతూ..నాకు పెళ్లి అనే ఫీల్డ్ కొత్త. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో తెలీదు. నేను 20 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా కాబట్టి ఆ ఆట గురించి నాకు తెలుసు. ఆట గురించి చెప్పమంటే అనర్గళంగా చెబుతా అది అనుభవంతో వచ్చింది. విడాకుల గురించి చెప్పాలంటే ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చాలా ఎక్కువ జాగ్రత్త పడతాను. నేను 26-27 ఏళ్ల వరకూ ఒంటరిగా ఉన్నా. ఎలాంటి రిలేషన్‌లోనూ లేను. బయటికి వెళ్లేవాడిని, స్నేహితులతో తిరిగేవాడిని. ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఎవ్వరితో రిలేషన్‌ మాత్రం పెట్టుకోలేదు.

అయితే నేను ప్రేమలో పడిన తర్వాత నాకు అన్నీ మధురంగానే కనిపించాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ చేసుకుంటూ పోయా. కానీ కళ్లకు అలుముకున్న ప్రేమ తెర తొలిగిపోతే అన్నీ ఇబ్బందిగానే అనిపిస్తాయి. పెళ్లి కూడా క్రికెట్ మ్యాచ్ లాంటిదే. కొందరికి సెటిల్ అవ్వడానికి నాలుగు ఐదు మ్యాచుల సమయం పడుతుంది. మరికొందరికి ఒక్క మ్యాచ్‌లోనే దొరకవచ్చు, ఇంకొందరికి ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు.. అయితే పెళ్లికి ముందు కాస్త అనుభవం మాత్రం చాలా ముఖ్యం అంటూ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.

శిఖర్ ధావన్ ఈ సంవత్సరం ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోవచ్చు. కానీ ODI ప్రపంచ కప్ 2023లో పాల్గొనాలనే అతని ఆశలు ఏ మాత్రం తగ్గలేదు. ఒకవేళ ధావన్ IPL 2023లో అత్యుత్తమ టచ్ చూపిస్తే, అతను తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఏది ఏమైనా ధావన్‌కు మరో అవకాశం ఇవ్వడం కూడా అవసరం. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతి ఇచ్చినప్పుడు భారత జట్టుకు ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధావన్ కూడా భారత జట్టులో భాగమయ్యాడు. కానీ ఆ పర్యటన తర్వాత ఈ అనుభవజ్ఞుడైన ఓపెనర్‌ని తొలగించారు.

శిఖర్ ధావన్ అంతర్జాతీయ కెరీర్
T20 ఇంటర్నేషనల్ – 68 మ్యాచ్‌లు, 1759 పరుగులు, 27.92 సగటు, 11 అర్ధ సెంచరీలు
ODI అంతర్జాతీయ – 167 మ్యాచ్‌లు, 6793 పరుగులు, 44.11 సగటు, 17 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు
టెస్ట్ క్రికెట్ – 34 మ్యాచ్‌లు, 2315 పరుగులు, 40.61 సగటు, ఏడు సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు
IPL – 206 మ్యాచ్‌లు, 6244 పరుగులు, 35.08 సగటు, రెండు సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు