Site icon HashtagU Telugu

Ind Vs SA ODI Series: టీమిండియా వ‌న్డే జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా శిఖ‌ర్ ధావ‌న్‌.!

Gill Dhawan

Gill Dhawan

అక్టోబర్ 6 నుంచి 11వ తేదీ వ‌ర‌కు సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్టర్లు ఆదివారం జట్టును ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు.

ఈ సిరీస్ నుంచి స్టార్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్‌లకు రెస్ట్ ఇచ్చారు. రోహిత్ స్థానంలో ఈ వన్డే జట్టును శిఖర్ ధావన్ ముందుండి నడిపించనున్నాడు.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ అక్టోబ‌ర్ 6న ప్రారంభ‌మై అక్టోబ‌ర్ 11వ తేదీన ముగియనుంది. తొలి వ‌న్డే అక్టోబ‌ర్ 6న ల‌క్నో వేదిక‌గా జ‌ర‌గనుంది. రెండో వ‌న్డే అక్టోబ‌ర్ 9న రాంచీలో, మూడో వ‌న్డే అక్టోబ‌ర్ 11న ఢిల్లీలో జ‌ర‌గనుంది.

జట్టు: శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్ , అవేష్ ఖాన్, సిరాజ్, దీపక్ చాహర్.

Exit mobile version