Site icon HashtagU Telugu

Shepherd : బాబూ షెపర్డ్ కొంచెం చూసి కొట్టు…ఇలా అయితే బౌలర్లు ఏమైపోవాలి

Shepherd Blasts 32 In Final

Shepherd Blasts 32 In Final

టీ ట్వంటీ (T 20) ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల హవా…పవర్ ప్లేలోనూ , స్లాగ్ ఓవర్లలో వారికి చుక్కలు కనిపిస్తుంటాయి. ప్రస్తుత ఐపీఎల్ (IPL) సీజన్ లోనూ పరుగుల వరద పారుతోంది. తాజాగా ఢిల్లీ కాపిటల్స్ (Delhi Capitals) తో మ్యాచ్ లో ముంబై ( Mumbai Indians) భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్- రోహిత్ శర్మ జోడీ వాంఖడేలో పరుగుల సునామీ సృష్టించారు. 10 ఓవర్లలోపే టీమ్ స్కోర్ ని వంద దాటించేశారు. అయితే ఆ తర్వాత రోహిత్, ఇషాన్ అవుటవ్వడంతో ఆట మందగించింది. టీమ్ స్కోర్ 200 దాటడం కూడా కష్టం అనేలా కనిపించింది. అయితే ఆఖరి ఓవర్లో షెపర్డ్ విజృంభించాడు.

We’re now on WhatsApp. Click to Join.

షెపర్డ్ (Shepherd ) మైదానంలోకి రావడంతో పరుగుల సునామీ వచ్చినట్లు అయ్యింది. 20వ ఓవర్ వేసిన నోర్ట్జేని మొదటి బంతి నుంచి ఉతికి ఆరేశాడు. తొలి బంతికే ఫోర్ బాది నోర్ట్జేకి హెచ్చరికలు జారీ చేశాడు. ఆ తర్వాత రెండో బంతిని భారీ సిక్సర్ గా మలిచాడు. ఆ తర్వాత 3, 4 బంతులను కూడా భారీ సిక్సర్లుగా బాదేసాడు. అతని విధ్వంసం అక్కడితో ఆగలేదు. ఆఖరి రెండు బంతులను ఫోర్, సిక్సర్ గా మలిచి ముంబయి జట్టు స్కోర్ 234కి చేరేలా చేశాడు.అతని జోరుతో ముంబయి ఫ్యాన్స్ కి సంబరాలు అంబరాన్ని అంటాయి. షెపర్డ్ కేవలం 10 బంతుల్లోనే ఏకంగా 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నోర్జే 4 ఓవర్లలో 2 వికెట్లు తీసినా షెపర్డ్ విధ్వంసానికి 65 పరుగులు సమర్పించుకున్నాడు. విశేషం ఏమిటంటే అతను చివర్లో చేసిన పరుగులతోనే ముంబై తొలి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విజయానికి 29 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత షెపర్డ్ ఇలా ఆడితే బౌలర్లు ఏం అయిపోవాలి అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Uttam Kumar Reddy : 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు