WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. కోహ్లీ క్రేజులో ఉన్నంత సేపు ఆశలన్నీ కోహ్లీపైనే పెట్టుకున్నారు. కానీ కోహ్లీ కూడా పెవిలియన్ బాట పట్టడంతో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి చెందింది. దీంతో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు జట్టు ఆటగాళ్లు. బీసీసీఐపై కూడా నెగటివ్ కామెంట్స్ చేశారు. తాజాగా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి బీసీసీఐ కి పాఠాలు నేర్పారు.
ఆస్ట్రేలియా నుంచి టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రి అభిప్రాయపడ్డారు. సెలక్టర్లు కూర్చొని ప్రణాళికను రూపొందించాలని శాస్త్రి అన్నాడు. స్టీవ్ స్మిత్ మరియు డేవిడ్ వార్నర్ వంటి అనుభవజ్ఞులైన స్టార్‌లతో పాటు మార్నస్ లాబుస్‌చాగ్నే, ట్రావిస్ హెడ్ మరియు కామెరాన్ గ్రీన్ వంటి యువకులను బరిలోకి దించినట్టు తెలిపారు. యువ ఆటగాళ్ళు సీనియర్ల నుండి త్వరగా నేర్చుకుంటారు. దీని కారణంగా ఆస్ట్రేలియా సీనియర్స్, జూనియర్స్ ఆటగాళ్లను తీసుకుని మిక్స్ చేస్తుంది. ఈ పద్దతి జట్టును బలంగా చేస్తుంది. ఇది కఠినమైన నిర్ణయం కావచ్చు.కానీ ఇది జట్టుకు అవసరం అని చెప్పారు శాస్త్రి.
Read More: You Tube: యూట్యూబ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ నిబంధనలను సవరించిన యూట్యూబ్ సంస్థ?