Site icon HashtagU Telugu

Shardul Thakur : జోహెనెస్ బర్గ్ లో శార్దూల్ రికార్డుల మోత

Shardul Thakur

Shardul Thakur

సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సీరీస్ ఆరంభానికి ముందు అందరూ బుమ్ర, షమీ , సిరాజ్ ల గురించే మాట్లాడారు. శార్ధూల్ ఠాకూర్ పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అయితే జొహెనేస్ బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శార్ధుల్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. భారీ ఆధిక్యం దిశగా వెళుతున్న సఫారీ టీమ్ ను దెబ్బ తీశాడు. 61 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఐదు వికెట్లు తీయడం అతని టెస్ట్ కెరీర్ లో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ లో శార్ధుల్ పలు రికార్డులు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాలో ఏ ఆసియా బౌలర్ కూడా ఈ స్థాయిలో రాణించలేదు. సఫారీ గడ్డపై 7 వికెట్లు తీసిన తొలి ఆసియా ఆటగాడు శార్దూల్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో నాగ్‌పూర్ టెస్టులో దక్షిణాఫ్రికాపై 7 వికెట్లు తీసిన అశ్విన్‌ను అధిగమించాడు. నాలుగో స్థానంలో 7 వికెట్లు తీసిన భారత తొలి ఫాస్ట్ బౌలర్ గా కూడా శార్దూల్ రికార్డులకెక్కాడు. అంతకుముందు కపిల్ దేవ్ 1981లో ఆస్ట్రేలియాపై నాలుగో స్థానంలో 5 వికెట్లు పడగొట్టాడమే ఇప్పటివరకు భారత్ తరపున అతుత్తమ ప్రదర్శన. మరోవైపు గత 100 ఏళ్లలో దక్షిణాఫ్రికా గడ్డపై అత్యుత్తమ రాణించిన విదేశీ బౌలర్లలో రెండో బౌలర్ గా శార్దూల్ నిలిచాడు. ఆండ్రూ కాడిక్ 1999లో అతని కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. డర్బన్ టెస్టులో 46 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. జొహనెస్‌బర్గ్‌ వేదికగా ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్‌ బౌలర్‌గా శార్దూల రికార్డుల్లోకెక్కాడు.ఈ వేదికపై గతంలో భారత దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే తొలుత ఈ ఫీట్‌ను నమోదు చేయగా, ఆతర్వాత జవగళ్ శ్రీనాథ్, , శ్రీశాంత్ , జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ షమీ ఈ మార్క్‌ని అందుకున్నారు. తాజాగా శార్దూల్‌ వీరి సరసన చేరాడు. కెరీర్‌లో ఆరో టెస్ట్‌ ఆడుతున్న శార్ధూల్‌కి ఇదే తొలి 5 వికెట్ల ఘనత. మొత్తం మీద శార్దూల జోరుతో తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 229 పరుగులకు ఆలౌట్ అయింది.

Exit mobile version