IND v ZIM, 2nd ODI: రెండో వన్డేలోనూ భారత్ దే విజయం…సీరీస్ కైవసం!

జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ కె.ఎల్ రాహుల్ జింబాబ్వేను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

  • Written By:
  • Updated On - August 20, 2022 / 09:18 PM IST

IND v ZIM, 2nd ODI: జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ కె.ఎల్ రాహుల్ జింబాబ్వేను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. టీమ్ ఇండియా పేసర్ల జోరుతో జింబాబ్వే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సీన్ విలియమ్స్ ఒంటరి పోరాటంతో జింబాబ్వే స్కోరువంద పరుగులు దాటింది. సీన్ విలియమ్స్ 42 పరుగులు చేసి ఔటవగా ..రయాన్ బర్ల్ ఒంటరి పోరాటం చేశాడు. అయితే మిగిలిన వారు సపోర్ట్ ఇవ్వకపోవడంతో జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రయాన్ బర్ల్ 39 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ లో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. టీమ్ ఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీసుకోగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

స్వల్ప లక్ష్యమే కావడంతో భారత్ ఈజీగా గెలుస్తుందని అనిపించింది. అయితే జింబాబ్వే బౌలర్లు పోరాడారు.దాదాపు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న కెఎల్ రాహుల్, 5 బంతుల్లో 1 పరుగుకే ఔటయ్యాడు. 21 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన శిఖర్ ధావన్, తనకా చివంగ బౌలింగ్‌లో అవుట్ కాగా, ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 6 రన్స్ కు వెనుదిరిగాడు.
శుభమన్ గిల్ కూడా ఔట్ కావడంతో వంద పరుగులలోపే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో దీపక్ హుడా, సంజూ శాంసన్ కలిసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చారు. శాంసన్ 39 బాల్స్ లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 43 రన్స్ చేశాడు. దీపక్ హుడా 25 రన్స్ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో జాంగ్వే 2, చివాంగా, నయూచి, రజా తలో ఒక్క వికెట్ తీశారు. ఈ విజయంతో టీమ్ ఇండియా 2 0 ఆధిక్యంలో నిలిచింది.