IND vs WI: టీమిండియాకు బిగ్ షాక్

వెస్టిండీస్ గడ్డపై భారత్ ఆటగాళ్లు జోరు కొనసాగుతుంది. గత టెస్టులో అజేయంగా విజయం సాధించిన టీమిండియా ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ కోసం సిద్దమవుతుంది.

Published By: HashtagU Telugu Desk
IND vs WI

New Web Story Copy (57)

IND vs WI: వెస్టిండీస్ గడ్డపై భారత్ ఆటగాళ్లు జోరు కొనసాగుతుంది. గత టెస్టులో అజేయంగా విజయం సాధించిన టీమిండియా ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ కోసం సిద్దమవుతుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్ల సభ్యుల్ని ప్రకటించారు. అయితే టెస్టులో ఓడిన విండీస్ వన్డేల్లో సత్తాచాటాలనే సంకల్పంతో జట్టులోకి ప్రమాదకర ఆటగాళ్లకు చోటు కల్పించారు.

టీమిండియా జట్టులో గాయాల బెడద తెలిసిందేగా. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు గాయాల సమస్యతో జట్టుకు దూరంగా ఉంటున్నారు. గత టెస్టు మ్యాచ్ లో గజ్జల్లో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు శార్దూల్ ఠాకూర్. మొదటి మ్యాచ్ లో ఉన్నప్పటికీ రెండో మ్యాచ్ కి దూరంగా ఉంటున్నట్టు బీసీసీఐ తెలిపింది. అయితే ప్రస్తుతం వన్డే సిరీస్ ప్రారంభం మొదలవ్వబోతున్నప్పటికీ శార్దూల్ ఠాకూర్ పై బీసీసీఐ మరో ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ వన్డేలకు కూడా దూరంగా ఉంటున్నాడనేది స్పష్టం అయింది.

శార్దూల్ ఠాకూర్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్ రౌండర్ గా సత్తా చాటగలడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై శార్దూల్ ఠాకూర్ ఆడిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. 109 బంతులు ఎదుర్కొని 51 పరుగులు సాధించాడు.శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్ లో కేకేఆర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్ ఆడే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ సూపర్ ఫామ్ లో ఉండటం ద్వారా జట్టుకి బ్యాటింగ్, బౌలింగ్ లోనూ కలిసొస్తుంది.

Also Read: poojitha Ponnada : ఎల్లో శారీ లో తన అందంతో కట్టిపడేస్తున్న పూజిత పొన్నాడ

  Last Updated: 26 Jul 2023, 11:24 PM IST