CWG TT Gold: టీటీలో శరత్ కమల్ కు గోల్డ్…హాకీలో రజతం

కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమపై ఉన్న అంచనాలు నిలబెట్టుకున్నారు. పివి సింధు, లక్ష్యసేన్‌లతో పాటు పురుషుల డబుల్స్‌లోనూ గోల్డ్ మెడల్‌ భారత్ ఖాతాలోనే చేరింది.

  • Written By:
  • Updated On - August 8, 2022 / 10:33 PM IST

కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమపై ఉన్న అంచనాలు నిలబెట్టుకున్నారు. పివి సింధు, లక్ష్యసేన్‌లతో పాటు పురుషుల డబుల్స్‌లోనూ గోల్డ్ మెడల్‌ భారత్ ఖాతాలోనే చేరింది. మెన్స్‌ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి జోడీ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన బెన్ లేన్- సీన్ వెండీ జోడీని 21-15, 21-13 తేడాతో రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి ఓడించారు. గేమ్స్ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తున్న ఈ భారత జోడీ తుదిపోరులోనూ అదరగొట్టింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మెడల్ సాధించింది.
అటు టేబుల్‌ టెన్నిస్‌లోనూ భారత క్రీడాకారులు సత్తా చాటారు. ముఖ్యంగా తెలుగుతేజం ఆచంట శరత్‌కమల్‌కు ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌ చిరస్మరణయంగా మిగిలిపోయాయి. ఈసారి అతడు నాలుగు మెడల్స్‌తో గేమ్స్‌ ముగించాడు. చివరి రోజు సింగిల్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించి అదిరే ముగింపునిచ్చాడు. . సింగిల్స్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన పిచ్‌ఫోర్డ్‌పై 11-13, 11-7, 11-6, 11-8 తేడాతో గెలిచాడు. 40 ఏళ్ల శరత్‌ కమల్‌కు కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇది రెండో సింగిల్స్‌ గోల్డ్‌ మెడల్‌. 2006 మెల్‌బోర్న్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన శరత్ కమల్ మళ్లీ ఇన్నాళ్లకు సింగిల్స్‌ గోల్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదే కాకుండా 2022 గేమ్స్‌లో ఇప్పటికే అతడు పురుషుల టీమ్ ఈవెంట్‌ లో స్వర్ణం , పురుషుస డబుల్స్‌లో సిల్వర్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు.

ఇప్పుడు సింగిల్స్‌లో గోల్డ్‌తో మొత్తంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో 13 మెడల్స్‌ గెలిచిన అథ్లెట్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే పురుషుల హాకీలో స్వర్ణం సాధించాలన్న భారత్ కల ఫలించలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో చేతిలో 0-7 తేడాతో భారత్‌ ఓటమిపాలైంది. తద్వారా భారత్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించింది. తొలి క్వార్టర్‌ నుంచే భారత్‌పై ఆస్ట్రేలియా అధిపత్యం చెలాయించింది. ఏ దశలోను భారత్‌ పోటీ ఇవ్వలేకపోయింది. నాలుగు క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా 7 గోల్స్‌ సాధించగా.. భారత్‌ కనీసం​ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది. దీంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఆస్ట్రేలియా హాకీ జట్టుకు ఇది నాలుగో బంగారు పతకం. పతకాల పట్టికలో 22 స్వర్ణాలు,16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 61 మెడల్స్‌తో గేమ్స్‌ను ముగించింది.