world cup 2023: ప్రపంచకప్ ఫైనల్‌కు శరద్ పవార్‌ను ఆహ్వానించలేదా?

2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. వరుస విజయాలతో ఫైనల్ కు చేరిన టీమిండియా

Published By: HashtagU Telugu Desk
world cup 2023

world cup 2023

world cup 2023: 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. వరుస విజయాలతో ఫైనల్ కు చేరిన టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. కాగా ఫైనల్ మ్యాచ్ రాజకీయంగా యూటర్న్ తీసుకుంటుంది. కపిల్ దేవ్ ని పిలవకపోవడం చర్చనీయాంశమైంది. తాజాగా ప్రపంచకప్ ఫైనల్‌కు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు ఆహ్వానం అందలేదన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. శరద్ పవార్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు. శరద్ పవార్ బిసిసిఐ మరియు ఐసిసి అధ్యక్షుడిగా ఉన్నందున, అతనికి ఆహ్వానం అందుతుందని భావించారు. అయితే శరద్ పవార్‌ను వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ఆహ్వానించలేదని విశ్వసనీయ నేత ఒకరు వెల్లడించారు. శరద్ పవార్, కపిల్ దేవ్‌లకు ఆహ్వానం అందలేదు. శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత క్రికెట్‌కు ఎంతో కృషి చేశారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు.

Also Read: Fenugreek Seeds : చర్మం మెరిసిపోవాలంటే మెంతులతో ఇలా చేయాల్సిందే?

  Last Updated: 21 Nov 2023, 06:44 PM IST