Shan Masood: పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. దానికి బదులుగా పాకిస్థాన్ 194 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత పాకిస్థాన్ ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ భీకర పోరాటం చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (Shan Masood) బలమైన సెంచరీ చేశాడు. షాన్ మసూద్ 145 పరుగులతో తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. దీంతోపాటు దక్షిణాఫ్రికాలో టెస్టుల్లో సెంచరీ సాధించిన తొలి పాకిస్థాన్ కెప్టెన్‌గా కూడా షాన్ మసూద్ నిలిచాడు.
మసూద్‌తో కలిసి ఓపెనర్‌కు వచ్చిన బాబర్ అజామ్ 81 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 205 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మహ్మద్ రిజ్వాన్ 41 పరుగులు, సల్మాన్ అలీ అగా 48 పరుగులతో ఫర్వాలేదనిపించారు. అయితే మిగతా వాళ్ళు చేతులెత్తేయడంతో పాకిస్థాన్ 10 వికెట్ల నష్టానికి 478 పరుగులు చేసింది.ఈ క్రమంలో పాకిస్థాన్ 123 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టింది. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన వెంటనే దక్షిణాఫ్రికాలో ఫాలో-ఆన్ తర్వాత అత్యధిక స్కోరు చేసిన విదేశీ జట్టుగా నిలిచింది. అంతకుముందు 1902లో దక్షిణాఫ్రికాలో ఫాలో ఆన్ ఆడుతూ ఆస్ట్రేలియా 372 పరుగులు చేసింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై 123 ఏళ్ల రికార్డును పాకిస్థాన్ బద్దలు కొట్టింది. ఇది కాకుండా దక్షిణాఫ్రికాలో ఫాలో-ఆన్ ఆడుతూ 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి జట్టుగా పాక్ జట్టు నిలిచింది.
Also Read: Nara Lokesh : పదవుల పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 615 భారీ పరుగులు నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ర్యాన్ రికెల్టన్ 259 పరుగులతో ఊచకోత కోశాడు. టెంబా బావుమా, కైల్ వారెన్‌లు సెంచరీల రాణించారు. ఫలితంగా సౌతాఫ్రికా 615 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ తొలి ఇన్నింగ్స్ లో 194 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది.