Shami Replaces Bumrah: బుమ్రా స్థానంలో షమీ.. బీసీసీఐ అధికారిక ప్ర‌క‌ట‌న..!

భారత టీ20 ప్రపంచకప్ 2022 జట్టులో గాయంతో దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ ష‌మీకి బీసీసీఐ శుక్రవారం జ‌ట్టులో స్థానం క‌ల్పించింది.

Published By: HashtagU Telugu Desk
Mohammed Shami

Mohammed Shami

భారత టీ20 ప్రపంచకప్ 2022 జట్టులో గాయంతో దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ ష‌మీకి బీసీసీఐ శుక్రవారం జ‌ట్టులో స్థానం క‌ల్పించింది. ఈ క్రమంలో షమీ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. వార్మప్ మ్యాచ్‌లకు ముందు బ్రిస్బేన్‌లోని భారత జట్టుతో షమీ చేరనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లు బ్యాకప్‌ ఆటగాళ్లుగా త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఆదివారం నుంచి ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 ప్ర‌పంచ క‌ప్ స‌మ‌రం ప్రారంభకానున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ష‌మీ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు: రోహిత్ శ‌ర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, దీప‌క్ హుడా, రిష‌బ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్‌, యుజ్వేంద్ర చాహ‌ల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌,అర్ష్‌దీప్‌ సింగ్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ.

 

  Last Updated: 14 Oct 2022, 06:10 PM IST