Site icon HashtagU Telugu

Shamar Joseph : రెండేళ్ల క్రితం సెక్యూరిటీ గార్డ్.. ఇప్పుడు స్టార్ బౌలర్

Shamar Joseph

Shamar Joseph

Shamar Joseph : వెస్టిండీస్‌ క్రికెట్ టీమ్  27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా టీమ్‌ను టెస్టు మ్యాచ్‌లో ఓడించింది. ఈ సక్సెస్‌ను విండీస్‌కు అందించింది ఎవరో తెలుసా ? ఫాస్ట్‌ బౌలర్‌ షమార్‌ జోసెఫ్‌ !! 24 ఏళ్ల షమార్‌ బౌలింగ్  ఫీట్లకు  క్రికెట్‌ ప్రపంచం ఆశ్చర్యపోయింది.  ఆస్ట్రేలియాలోని గబ్బా స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో శనివారం బ్యాటింగ్‌ చేస్తుండగా స్టార్క్‌ వేసిన యార్కర్‌ తాకి షమార్‌ కాలి బొటన వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడి.. తర్వాతి రోజు పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకొని గ్రౌండ్‌లోకి వచ్చాడు. 11.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి 7 వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఓటమికి బాటలు వేశాడు. 216 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. షమార్ జోసెఫ్‌  అద్భుత బౌలింగ్ కారణంగా 207 రన్స్‌కే ఆలౌటైంది. 8 పరుగుల స్వల్ప తేడాతో విండీస్‌  చారిత్రక విజయం సాధించింది. దీంతో షమార్‌పై(Shamar Joseph) ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

షమార్‌ జోసెఫ్‌ కెరీర్ గ్రాఫ్

Also Read : Family Pension : మహిళా ఉద్యోగి పిల్లలను కూడా నామినేట్ చేయొచ్చు