world cup 2023: మాథ్యూస్ సోదరుడు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ పై హాట్ కామెంట్స్

బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ బెదిరించాడు. షకీబ్ అల్ హసన్, ఏంజెలో మాథ్యూస్ మధ్య టైం అవుట్ వివాదం కారణంగా చాలా గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో టైం అవుట్ అయిన తొలి ఆటగాడిగా ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు.

world cup 2023: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ బెదిరించాడు. షకీబ్ అల్ హసన్, ఏంజెలో మాథ్యూస్ మధ్య టైం అవుట్ వివాదం కారణంగా చాలా గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో టైం అవుట్ అయిన తొలి ఆటగాడిగా ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు.

శ్రీలంక ఇన్నింగ్స్ 25వ ఓవర్లో సదీర సమరవిక్రమ ఔటైన తర్వాత ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాథ్యూస్ స్టాన్స్ తీసుకుంటుండగా, అతని హెల్మెట్ పట్టీ విరిగిపోయింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ కొత్త హెల్మెట్ అడిగాడు.మాథ్యూస్ ఆలస్యం చేయడం చూసి బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సమయం ముగిసిందని ఎంపైర్ కు అపీల్ చేయడంతో ఎంపైర్ నిబంధనల ప్రకారం మాథ్యూస్ ని ఔట్ గా ప్రకటించాడు. దీని తర్వాత షకీబ్ క్రీడా స్ఫూర్తిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో బంగ్లాదేశ్ కెప్టెన్‌ను ట్రెవిన్ బహిరంగంగా బెదిరించాడు. మేము చాలా నిరాశ చెందాము. బంగ్లాదేశ్ కెప్టెన్‌కు క్రీడాస్ఫూర్తి లేదు, పెద్దమనిషి ఆటలో మానవత్వం ప్రదర్శించలేదు. షకీబ్‌కు శ్రీలంకలో స్వాగతం లేదు. అతను ఇక్కడికి వచ్చి ఏదైనా అంతర్జాతీయ లేదా లంక ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఆడితే అతనిపై రాళ్లు రువ్వుతారు. అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బంగ్లాదేశ్ 2025లో శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు మరియు మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది.

Also Read: Telangana Polls : జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్