Site icon HashtagU Telugu

Shakib Al Hasan: అంపైర్ తప్పిదానికి బంగ్లా కెప్టెన్ బలి

Shakib

Shakib

Shakib Al Hasan:  ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచకప్ లో అంపైరింగ్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ ఎల్బీడబ్య్లూ తీవ్ర చర్చనీయాంశమైంది. థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి షకీబుల్ బలయ్యాడు. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్లో నాలుగో బంతికి షకీబ్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. స్పిన్నర్ షాదాబ్ వేసిన ఈ ఓవర్లో మొదట సౌమ్యా సర్కార్ ఔట్ అవగా తర్వాతి బంతికే షకీబ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో పాక్‌ ఆటగాళ్లు అప్పీ్ల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు.

ఆలస్యం చేయకుండా షకీబ్‌ రివ్యూకు వెళ్లాడు. అయితే రివ్యూలో బంతికి ముందుగా బ్యాట్ ను తగిలినట్టు అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టంగా స్పైక్ కనిపించింది. ఆ తర్వాతే బంతి షకీబ్ ప్యాడ్లను తాకింది. కానీ, ఇన్ సైడ్ ఎడ్జ్ క్లియర్ గా ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు. బ్యాట్ నేలను తాకడం వల్లే అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ వచ్చినట్టు పేర్కొన్నాడు. కానీ, స్పైక్ వచ్చిన సమయంలో బ్యాట్ కు, నేలకు మధ్య ఖాళీ టీవీ రీప్లేల్లో కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బంగ్లా కెప్టెన్ షకీబ్ షాకయ్యాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసి ఏం చేయలేక నిరాశతో మైదానం వీడాడు. తర్వాత తక్కువ స్కోరుకే పరిమితమైన బంగ్లా పాక్ చేతిలో ఓడిపోయింది. షకీబుల్ ఎల్బీడబ్ల్యూ వివాదంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఐసీసీని, అంపైర్లను ట్రోల్ చేస్తున్నారు.