Shahneel Gill: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అయితే మ్యాచ్‌కు మరింత భావోద్వేగాన్ని కలిగించింది గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోదరి షానీల్ గిల్ (Shahneel Gill) కళ్లలో కనిపించిన కన్నీళ్లు. మ్యాచ్ అనంతరం స్టాండ్స్‌లో ఆమె భావోద్వేగంతో ఉన్న దృశ్యం కెమెరాల్లో పడటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మ్యాచ్ మొదటి ఓవర్‌లోనే శుభ్‌మన్ గిల్ ఔటవ్వడం గుజరాత్‌కు తీవ్ర ఎదురుదెబ్బ అయింది. సాయి సుదర్శన్ 80 పరుగులతో పోరాడినప్పటికీ.. మిగిలిన జట్టు తలవంచాల్సి వచ్చింది. ఫీల్డింగ్‌లోనూ కొన్ని తప్పిదాలు జట్టు ఓటమికి కారణమయ్యాయి. ఇదంతా చూసిన షానీల్ గిల్.. గెలుపు ఆశలు చచ్చిపోయినపుడు స్టాండ్స్‌లో కన్నీళ్లతో కనిపించారు. ఆమె ఈ ఓటమికి ఒక భావోద్వేగ ప్రతీకగా మారారు.
Also Read: India Turkey: టర్కీకి దెబ్బ మీద దెబ్బ.. భారత్ మరో నిర్ణయం
షానీల్ గిల్ ఎవరు?
షానీల్ గిల్ శుభ్‌మన్ గిల్ సోదరి. ఆమె ఒక డిజిటల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు పొందారు. సోషల్ మీడియాలో ఆమెకు 3.86 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆమె స్టేడియంలో అనుసంధానంగా కనిపించడం, శుభ్‌మన్‌కు ఇచ్చిన మద్దతు, ఆమె శైలితో పాటు ఆమె చిరునవ్వుతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
పని విషయానికి వస్తే ఆమె కెనడాలోని SkipTheDishes అనే సంస్థలో Success Specialistగా పనిచేస్తున్నారు. అయితే ప్రతీ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ఆమె భారతదేశానికి రావడం, ప్రత్యక్షంగా శుభ్‌మన్‌ను ప్రోత్సహించడం సాధారణమే. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమి ఆమెను తీవ్రంగా కదిలించింది. ఈ కన్నీటి క్షణం అభిమానుల మనసును తాకింది. క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు. అది ఒక భావన అని ఆ ఆటలో ఆటగాళ్ల కుటుంబ సభ్యుల కష్టాలు, ఆశలు, ప్రేమ ఏమిటో షానీల్ గిల్ చూపించారు.