Site icon HashtagU Telugu

Shahid Afridi’s Sister Passes Away : పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇంట్లో విషాదం

Shahid Afridi's Sister Pass

Shahid Afridi's Sister Pass

పాకిస్తాన్ (Pakistan) మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ (Shahid Afridi) ఇంట్లో విషాదం నెలకొంది. అఫ్రిదీ చెల్లి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. ఆస్పత్రిలో (Karachi) చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్తున్నానని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు గత రాత్రి ట్వీట్ చేశాడు అఫ్రిది. ఇంతలోనే చనిపోయిన వార్త వినాల్సి వస్తుందని అతడు ఊహించి ఉండడు. ఈ విషయం తెలిసిన ప్రముఖులు అఫ్రిదీకి సానుభూతి తెలియజేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె కొద్దీ రోజుల క్రితం ఆఫ్రిది భారత జట్టుపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. వన్డే ప్రపంచకప్‌ జరుగుతున్న వేళ అఫ్రిదీ.. “భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. కొన్నేళ్లుగా టీమిండియా క్రికెట్‌లో నాణ్యత పెరిగింది. ఇది చాలా అద్భుతంగా సాగుతోంది. గతంలో మేం భారత్‌ నుంచి మంచి బ్యాట్స్‌మెన్‌లు.. పాకిస్థాన్‌ నుంచి మంచి బౌలర్లు వస్తారని భావించే వాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం భారత్‌ జట్టులో బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఇద్దరూ బాగానే ఉన్నారు. మాంసాహారం తినడం ప్రారంభించినప్పటి నుంచి భారత బౌలర్ల మరింత మెరుగ్గా రాణిస్తున్నారు” అని అఫ్రిది తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : Jio Debit Cards : ‘జియో’ డెబిట్ కార్డ్స్ కూడా వస్తున్నాయ్..