Site icon HashtagU Telugu

Shahid Afridi: భారత్ , పాక్ మ్యాచ్ లో విజేతపై అఫ్రిది ఊహించని ఆన్సర్

Asia Cup

Asia Cup

ఇండియా , పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫాన్స్ కు పండుగే. చాలా రోజుల తర్వాత ఆసియా కప్ తో ఈ పండుగ తిరిగి వచ్చింది. ఆదివారం చిరకాల ప్రత్యర్ధుల పోరు అభిమానులను అలరించనుంది. రెండు దేశాల మధ్య సరైన సంభంధాలు లేని కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగట్లేదు. దీంతో ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో చివరి సారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో గెలుపు ఎవరిది అనే ప్రశ్నకు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఆసక్తికర సమాధానాన్నిచ్చాడు.
అయితే అఫ్రిదీ పాకిస్థాన్ గెలుస్తుందని చెప్తాడనుకుంటే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఊహించని ఆన్సర్ ఇచ్చాడు. ఎవరు తక్కువ తప్పులు చేస్తే వారే మ్యాచ్ గెలుస్తారంటూ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం అఫ్రిది ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఆసియా కప్ గత రికార్డుల పరంగా భారత్ దే పై చేయిగా నిలిచింది. ఆసియా కప్ లో ఇరు జట్లు 14 సార్లు తలపడగా.. అత్యధికంగా 8 విజయాలతో భారత్ ముందుంది.

పాకిస్థాన్‌ ఐదింటిలో గెలవగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ జరగనుండగా.. యూఏఈ ఆతిథ్యం ఇస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఇప్పటివరకు అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. గత ఎడిషన్‌ను వన్డే ఫార్మాట్‌లో జరగ్గా.. ఈ సారి మాత్రం టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.