Site icon HashtagU Telugu

Virat Kohli- Rinku Singh: విరాట్‌ను ప‌ట్టించుకోని రింకూ సింగ్! సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Virat Kohli- Rinku Singh

Virat Kohli- Rinku Singh

Virat Kohli- Rinku Singh: ఐపీఎల్ 2025 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈసారి లీగ్‌లో తొలి మ్యాచ్‌ కేకేఆర్‌, ఆర్‌సీబీ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రారంభ వేడుకలు ఘ‌నంగా జరిగాయి. ఈ సమయంలో దిశా పట్నీ, కరణ్ ఔజ్లా, శ్రేయా ఘోషల్‌తో కలిసి ప్రదర్శన ఇచ్చారు. ఇంతలో రింకూ సింగ్ తాను చేసిన ఒక ప‌ని సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

విరాట్ కోహ్లీని రింకూ పట్టించుకోలేదు

ఐపీఎల్ ప్రారంభోత్సవం సందర్భంగా షారుక్ ఖాన్ RCB స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని వేదికపైకి పిలిచాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌లో వర్ధమాన యువ ఆటగాళ్ల గురించి విరాట్, షారుక్ చర్చించుకున్నారు. దీని తర్వాత షారుక్ ఖాన్ కూడా KKR బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌ను వేదికపైకి పిలిచాడు. రింకూ షారుఖ్‌తో కలిసి “లుట్‌పుట్ గయా” పాటకు కాలు క‌దిపాడు. ఇది ప్రారంభ వేడుక‌ల‌ను మరింత అద్భుతంగా చేసింది.

అయితే వేదికపైకి వస్తున్న రింకూ సింగ్.. విరాట్ కోహ్లీని (Virat Kohli- Rinku Singh) పట్టించుకోకుండా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ముందుకు సాగాడు. ఈ దృశ్యం కెమెరాలో బంధించబడి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక యాదృచ్చికంగా జరిగిందా అనే దానిపై అధికారిక ప్రకటన లేదు. అయితే దీనిపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు.

Also Read: IPL 2025: ఐపీఎల్‌లో నేడు తొలి మ్యాచ్‌.. టాస్ సమయం మార్పు, కార‌ణ‌మిదే?

బాలీవుడ్ తారలు సంద‌డి

ఐపీఎల్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ, కేకేఆర్ జట్లు తలపడుతుండగా.. అంతకు ముందు అద్భుతంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ గ్రాండ్ వేడుకలో షారుఖ్ ఖాన్, కరణ్ ఔజ్లా, శ్రేయా ఘోషల్, దిశా పటానీ వంటి తారలు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఐపీఎల్ వేడుక‌ల‌ను ప్రారంభించారు. దిశా పటాని తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె వేదికపైకి అడుగుపెట్టిన వెంటనే ఆమె బాఘీ 3లోని పాటతో సహా చాలా పాటలకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది.