Site icon HashtagU Telugu

Shafali Verma: షెఫాలీ ధనాధన్…భారత్ బోణీ

Shafali Verma

Resizeimagesize (1280 X 720) 11zon

మహిళల అండర్ 19 వరల్డ్ కప్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో అతిధ్య జట్టు సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ (Shafali Verma) మెరుపు బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. ఆమెతో పాటు శ్వేతా షెహ్రావత్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్ సునాయాసంగా గెలిచింది. లక్ష్యచేధనలో దూకుడుగా ఆరంభించిన భారత అమ్మాయిలు.. సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో షెఫాలీ వర్మ 4,4,4,4,4,6 వరుసగా 6 బంతుల్లో 6 బౌండరీలు బాదింది. షెఫాలీ దెబ్బకు సౌతాఫ్రికా బౌలర్ న్టాబిసెంగ్ నిని ఒకే ఓవర్‌లో 30 పరుగులిచ్చుకుంది.

Also Read: PM Modi Ravana Posters: రాముడిగా నితీష్.. రావణుడిగా మోదీ పోస్టర్లు

మొదట బ్యాటింగ్ గు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసింది. సిమోన్ లౌరెన్స్ 44 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 61 హాఫ్ సెంచరీతో రాణించగా.. మాడిసన్ లాండ్స్‌మన్ 17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32. రన్స్ చేశారు. భారత బౌలర్లలో షెఫాలీ వర్మ రెండు వికెట్లు.. సోనమ్ యాదవ్, పర్షావి చోప్రాకు తలో వికెట్ తీశారు. మహిళల అండర్ 19 విభాగంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు 4 గ్రూపులుగా విడిపోయి 4 వేదికల్లో తలపడుతునున్నాయి.