world cup 2023: రేపు ధర్మశాలలో వర్షం పడే అవకాశం..

ప్రపంచ కప్‌లోటీమిండియా న్యూజిలాండ్‌తో ఐదవ మ్యాచ్ ఆడనుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. రేపు ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ పైనే అందరి దృష్టి ఉంది.

Published By: HashtagU Telugu Desk
World Cup 2023 (41)

World Cup 2023 (41)

world cup 2023: ప్రపంచ కప్‌లోటీమిండియా న్యూజిలాండ్‌తో ఐదవ మ్యాచ్ ఆడనుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. రేపు ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని జట్లు భారత్‌, న్యూజిలాండ్‌ మాత్రమే. ఇరు జట్లు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగనుంది. అయితే మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని, ఇదే జరిగితే అభిమానులు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రపంచకప్‌లో భారత్‌కి చివరి ఓటమి న్యూజిలాండ్‌పైనే. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో కివీస్ జట్టు 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఆ మ్యాచ్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్.కాగా 2019 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.

ఆదివారం ధర్మశాలలో జరిగే మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడ గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రేపు మధ్యాహ్నం ఈదురు గాలులతో పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగింది. చివరికి మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. అయితే ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే భారత్, న్యూజిలాండ్ జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: world cup 2023: మూడో వికెట్ కోల్పోయిన లంక.. టార్గెట్ 263

  Last Updated: 21 Oct 2023, 04:42 PM IST