Several Fans Injured: టీమిండియా ప‌రేడ్‌.. ప‌లువురికి గాయాలు, ముంబై పోలీసులు ఏం చెప్పారంటే..?

ఈ సమయంలో కొంత తొక్కిసలాట జరగడంతో కొంద‌రికి (Several Fans Injured) గాయాల‌య్యాయి. ఆ తర్వాత గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు.

  • Written By:
  • Updated On - July 5, 2024 / 09:11 AM IST

Several Fans Injured: టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని భారత జట్టు గురువారం జూలై 4న ముంబైలో మెగా రోడ్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా క్రీడాకారులను, ట్రోఫీని చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. ఈ సమయంలో కొంత తొక్కిసలాట జరగడంతో కొంద‌రికి (Several Fans Injured) గాయాల‌య్యాయి. ఆ తర్వాత గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. తొక్కిసలాట తర్వాత అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇది కాకుండా ముంబై పోలీసులు స్వయంగా ప్రమాదం గురించి సమాచారాన్ని పంచుకున్నారు.

ముంబై పోలీసులు క్షతగాత్రుల గురించి సమాచారం ఇచ్చారు

ఈ ప్రమాదం గురించి ముంబై పోలీసులు సమాచారం ఇస్తూ.. భారత క్రికెట్ జట్టుకు స్వాగతం పలికేందుకు వచ్చిన చాలా మంది అభిమానుల పరిస్థితి క్షీణించిందని, కొంతమంది గాయపడ్డారని, కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెప్పారు. 10 మందిని చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడ్మిట్ అయిన ఇద్దరిలో ఒకరికి ఫ్యాక్చ‌ర్ కాగా, మరొకరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంద‌ని తెలిపారు.

Also Read: Virat- Rohit Dance: ముంబైలో డ్యాన్స్ వేసిన రోహిత్‌, విరాట్‌.. ఇదిగో వీడియో..!

జూన్ 29న భారత జట్టు ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. దీని తర్వాత ప్రతికూల వాతావరణం, తుఫాను కారణంగా టీమిండియా బార్బడోస్‌లోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. ఆ తర్వాత జూలై 4న టీమ్ ఇండియా తిరిగి వచ్చింది. అయితే భార‌త్ వ‌చ్చిన త‌ర్వాత టీమిండియా విజయోత్సవ కవాతును వీక్షించేందుకు ముంబై వీధుల్లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ స‌మ‌యంలో ఓ మహిళ ఊపిరాడక స్పృహతప్పి పడిపోయిన వీడియో బయటపడింది. ఆ తర్వాత పోలీసులు ఆ మహిళను భుజాలపై ఎక్కించుకుని గుంపు నుంచి బయటకు తీసుకొచ్చారు.

తోపులాట వల్ల చాలా నష్టం జరిగింది

ట్రోఫీతో ఉన్న టీమిండియా ఆటగాళ్లను చూసిన ఆనందంలో చాలా మంది అభిమానులు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. వాస్తవానికి విజయోత్సవ వేడుకలో అభిమానులు వాహనాల టాప్‌పై డ్యాన్స్ చేశారు. దీని కారణంగా చాలా వాహనాల పైకప్పులు దెబ్బతిన్నాయి. టీమ్ ఇండియా రోడ్ షో మెరైన్ డ్రైవ్ గుండా వెళ్ళిన తర్వాత విరిగిన స్తంభాలు, బూట్లు.. చెప్పులు రోడ్లపై చెల్లాచెదురుగా కనిపించాయి.

We’re now on WhatsApp : Click to Join