7 sixes 1 over: ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లు.. యూవీ రికార్డు బద్దలు

2007 టీ ట్వంటీ వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు ఫాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు ఆ

  • Written By:
  • Updated On - November 28, 2022 / 03:57 PM IST

2007 టీ ట్వంటీ వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు ఫాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఒకే ఓవర్లో ఆరు కాదు ఏడు సిక్సర్లతో సరికొత్త రికార్డు నమోదయింది. టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ అరుదైన రికార్డు సాధించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్.. ఉత్తర్ ప్రదేశ్‌తో రెండో క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

యూపీ బౌలర్ శివా సింగ్ వేసిన 49వ ఓవర్‌లో రుతురాజ్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ సిక్సర్లుగా కొట్టగా.. ఒత్తిడికి గురైన బౌలర్ ఐదో బంతిని నోబాల్‌గా వేసాడు. ఆ బంతిని కూడా సిక్స్ బాదిన రుతురాజ్ తర్వాతి రెండు బంతులను కూడా సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. దాంతో ఈ ఓవర్‌లో 43 పరుగులు వచ్చాయి. రుతురాజ్ వరల్డ్ రికార్డు నమోదు చేస్తే.. ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డును శివా సింగ్ మూటగట్టుకున్నాడు. రుతురాజ్ విధ్వంసంతో మహారాష్ట్ర ఈ మ్యాచ్ లో 330 పరుగుల భారీ స్కోరు సాధించింది.