IND vs AFG: నేడు ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా ఢీ.. విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్‌పైనే అందరి చూపు..!

ప్రపంచకప్‌లో విజయంతో బోణి చేసిన టీమిండియా నేడు ఆఫ్ఘనిస్థాన్‌ (IND vs AFG)తో తలపడనుంది. అఫ్గానిస్థాన్‌తో ఈ మ్యాచ్‌లో ఇరు దేశాల అభిమానుల కళ్లు విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌పైనే ఉన్నాయి.

  • Written By:
  • Updated On - October 11, 2023 / 11:45 AM IST

IND vs AFG: ప్రపంచకప్‌లో విజయంతో బోణి చేసిన టీమిండియా నేడు ఆఫ్ఘనిస్థాన్‌ (IND vs AFG)తో తలపడనుంది. అఫ్గానిస్థాన్‌తో ఈ మ్యాచ్‌లో ఇరు దేశాల అభిమానుల కళ్లు విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌పైనే ఉన్నాయి. దీనికి కారణం కూడా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వివాదం తర్వాత విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ ముఖాముఖి తలపడడం ఇదే తొలిసారి. నిజానికి ఐపీఎల్‌ ఇటీవలి సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఐపీఎల్ లో విరాట్ కోహ్లి, నవీన్ ఉల్ హక్ మధ్య అతిపెద్ద వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీని తర్వాత గౌతమ్ గంభీర్ కూడా బౌండరీ లైన్‌పై పోరాటానికి దిగి విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు.

నవీన్ ఉల్ హక్, గౌతమ్ గంభీర్‌లకు విరాట్ కోహ్లీ కూడా ధీటుగా సమాధానం ఇచ్చాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగింది. గత 5 నెలల్లో నవీన్ ఉల్ హక్ చాలాసార్లు విరాట్ కోహ్లి పేరు చెప్పకుండానే టార్గెట్ చేశాడు. గౌతం గంభీర్ కూడా చాలా సందర్భాలలో నవీన్ ఉల్ హక్‌కు మద్దతు ఇచ్చాడు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఈ విషయం గురించి పెద్దగా ప్రస్తావించలేదు.

Also Read: PAK vs SL: ప్రపంచ కప్ లో పాకిస్తాన్ రికార్డు.. భారీ స్కోర్ ఛేదించిన పాక్..!

We’re now on WhatsApp. Click to Join.

నవీన్ ఉల్ హక్ ఆసియా కప్‌లో ఆడలేదు

ప్రపంచకప్‌కు ముందు ఆసియాకప్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడ్డాయి. నవీన్ ఉల్ హక్ ఆసియా కప్ జట్టులో లేకపోవడంతో విరాట్ కోహ్లీతో పోటీ పడలేకపోయాడు. ప్రపంచకప్ తర్వాత నవీన్ ఉల్ హక్ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరూ ఈ ఫార్మాట్‌లో చివరిసారిగా తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. ఢిల్లీ విరాట్ కోహ్లికి సొంత మైదానం. ఇక్కడ అతనికి భారీ మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విరాట్ కోహ్లి ఏ ఛాన్స్ కూడా వదిలిపెట్టడు. ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విరాట్‌ కోహ్లి అద్భుత ప్రదర్శన చేశాడు. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో కోహ్లీ 85 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.