Site icon HashtagU Telugu

SA Series : భారత్ కు షాక్… ఆ ప్లేయర్స్ ఔట్…!!

T20 Iccrankings

T20 Iccrankings

ఆస్ట్రేలియాపై సీరీస్ గెలిచి ఉత్సాహంతో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికాతో జరగనున్న సీరీస్ కు ముగ్గురు కీలక ఆటగాళ్ళు దూరమయ్యారు. మహ్మద్ షమి, ఆల్‌రౌండర్‌ దీపక్ హుడా సఫారీ లతో సీరీస్ ఆడే అవకాశం లేదు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు కూడా ఎంపికైన పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ షమి కొవిడ్‌ బారిన పడడంతో అతని స్థానంలో ఉమేష్‌ యాదవ్‌ను తీసుకున్నారు. అయితే షమి ఇంకా కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా అతడు దూరం కానున్నాడు. ఈ నేపద్యంలో ఉమేష్ యాదవ్ జట్టులో కొనసాగనున్నాడు. అటు ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడాకు గాయం కావడంతో సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాతో హైదరాబాద్‌లో జరిగిన మూడో టీ ట్వంటీకి ముందే గాయపడడంతో అతడు సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. హుడా . శ్రేయస్‌ అయ్యర్‌ కు చోటు దక్కింది.

కాగా వరల్డ్‌కప్‌ టీమ్‌లోనూ ఉన్న వీరిద్దరూ మెగా టోర్నీకి అందుబాటులో ఉంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు వర్క్ లోడ్ కారణంగా హార్దిక్ పాండ్య కు రెస్ట్ ఇచ్చినట్టు సమాచారం. వరల్డ్ కప్ కి ముందు పాండ్య బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉండనున్నాడు. అతని ఫిట్ నెస్ పై అప్రమత్తం గా ఉండాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

సౌతాఫ్రికాతో అక్టోబర్‌ టీ ట్వంటీ సిరీస్‌ ముగియగానే అక్టోబర్‌ 6న భారత్ వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇదిలా ఉంటే సౌతాఫ్రికాతో మూడు టీ ట్వంటీల సీరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం జరుగుతుంది.

Exit mobile version