Site icon HashtagU Telugu

Hyderabad Match Preview:మూడో టీ20కి పిచ్, వాతావరణం ఎలా ఉన్నాయంటే…

Match (1)

Match (1)

భారత్, ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే రెండో మ్యాచ్ లో అదరగొట్టిన టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి లెక్క సరి చేసింది. దీంతో హైదరాబాద్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ సిరీస్ ను డిసైడ్ చేయబోతోంది. ప్రపంచకప్ కు ముందు ఇంకా ఒక సిరీస్ మాత్రమే ఆడనున్న భారత్ తుది జట్టు కాంబినేషన్ పై మరికొంత క్లారిటీ రావాల్సి ఉంది. రీ ఎంట్రీలో బూమ్రా లయ అందుకోవడం, అక్షర్ పటేల్ స్పిన్ మ్యాజిక్ వంటి అంశాలు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

అటు బ్యాటింగ్ లో రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం కూడా కలిసొచ్చే అంశమే. అయితే పేసర్ హర్షల్ పటేల్ భారీగా పరుగులు ఇస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరి సిరీస్ డిసైడర్ లో హర్షల్ ఎంతవరకూ ఫామ్ అందుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ స్టేడియం పిచ్ లో భారత్ కు మంచి రికార్డే ఉంది. ఇక్కడ ఒకే ఒక టీ ట్వంటీ ఆడి భారీ విజయాన్ని అందుకుంది. విండీస్ పై 208 పరుగుల లక్ష్యాన్ని అలవకోకగా ఛేదించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 94, రాహుల్ 62 రన్స్ తో అదరగొట్టారు. కాగా ఉప్పల్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్ కే అనుకూలంగా ఉంటుంది.

ఐపీఎల్ లో చాలా సార్లు ఇక్కడ పరుగుల వరద పారింది. దీంతో మరోసారి హెచ్ సిఎ ఫ్లాట్ వికెట్ నే తయారు చేసినట్టు తెలుస్తోంది. రెండు జట్లలోనూ స్టార్ బ్యాటర్లు ఉండడంతో బౌండరీలు, సిక్సర్ల వర్షం ఖాయమని చెప్పొచ్చు. ఇక వాతావరణం విషయానికొస్తే వర్షం ముప్పు లేదనే తెలుస్తోంది. మ్యాచ్ జరిగే రోజు వర్షం పడే అవకాశాలు లేదు. నాగ్ పూర్ లో వర్షం కారణంగానే మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు. సిరీస్ డిసైడర్ కావడంతో పూర్తి మ్యాచ్ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దాదాపు మూడేళ్ళ తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.