Sehwag: రిజర్వ్ ప్లేయర్స్ కు ఛాన్స్ ఇవ్వరా?

ఐపీఎల్ లో ఐదుసార్లు ​ ఛాంపియన్​ గా నిలిచిన ముంబయి ఇండియన్స్​ జట్టు ప్రస్తుత సీజన్ లో ఇంకా గెలుపు బోణి కొట్టలేదు.

  • Written By:
  • Updated On - April 9, 2022 / 11:25 AM IST

ఐపీఎల్ లో ఐదుసార్లు ​ ఛాంపియన్​ గా నిలిచిన ముంబయి ఇండియన్స్​ జట్టు ప్రస్తుత సీజన్ లో ఇంకా గెలుపు బోణి కొట్టలేదు. ఈ సీజన్ లో ఇప్పటికే 3 మ్యాచ్​లు ఆడిన ముంబై ఇండియన్స్ అన్నింట్లోనూ ఓటమి చవిచూసింది. దీంతో ఈ అగ్రశ్రేణి జట్టుకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పటటికీ.. పేస్‌ బౌలింగ్‌లో మాత్రం తేలిపోతుంది. జస్ప్రీత్‌ బుమ్రా తప్ప మిగిలిన బౌలర్లు అందరూ విఫలమవుతున్నారు.

అందుకే బుమ్రాకు తోడుగా జయదేవ్ ఉనద్కత్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. ఐపీఎల్‌ హిస్టరీలో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఉనద్కత్‌ను ఎందుకు పక్కన అర్ధం కావడంలేదు. ఐపీఎల్ 2022 సీజన్‌ వరకు ముంబై జట్టులో నాథన్ కౌల్టర్ నైల్ ఉండేవాడు. జట్టులో ఏ బౌలరైనా విఫలమయితే కౌల్టర్ నైల్ తుది జట్టులోకి వచ్చేవాడు. అయితే ఇప్పుడు మాత్రం ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అసలు రిజర్వ్ బెంచ్ లో ఉన్నవారిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే వంటి ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కడంలేదు. గత కొన్ని మ్యాచుల్లో బాసిల్ థంపి, డేనియల్ సామ్స్‌ విఫలమవుతున్నారు. కాబట్టి వీరిద్దరి స్థానాల్లో జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండేకు అవకాశం​ ఇవ్వాలి ఐపీఎల్‌లో అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా బుమ్రాకు జయదేవ్ ఉనద్కతే సరైన జోడి అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 86 మ్యాచ్‌లాడిన జయదేవ్ ఉనద్కత్ 85 వికెట్లు పడగొట్టాడు.