Sehwag Son Aryavir: క్రికెట్‌లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ..!

  • Written By:
  • Publish Date - December 7, 2022 / 08:20 AM IST

టీమిండియా (TEAM INDIA) మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు (Sehwag Son Aryavir) ఆర్యవీర్ దేశీవాళీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్‌-16 జట్టుకు ఆర్యవీర్ ఎంపికయ్యాడు. ఆర్యవీర్‌ అద్భుతమైన బ్యాటర్‌ అని, అతడి ఫుట్‌వర్క్‌ చాలా బాగుందని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్ ఆకాష్ మల్హోత్రా అన్నారు.

భారత జట్టు మాజీ వెటరన్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ అండర్-16 జట్టులోకి ఎంపికయ్యాడు. బీసీసీఐ నిర్వహించనున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్-16 జట్టులో ఆర్యవీర్‌ను చేర్చారు. అయితే అతను ఇంకా జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. కానీ జట్టులోకి ఎంపిక కావడం అతనికి పెద్ద విజయం. ఆర్యవీర్ బ్యాటింగ్‌లో తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. టీమిండియా (TEAM INDIA) మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆర్యవీర్‌కు ఇష్టమైన ఆటగాడు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. అందులో విరాట్ కోహ్లీని తన అభిమాన ఆటగాడిగా అభివర్ణించాడు.

Also Read: Taj Mahal: తాజ్ మహల్ లో పరిశోధనకు ఆదేశాలివ్వలేం: సుప్రీంకోర్టు

ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌కు చెందిన వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడు బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. సెహ్వాగ్ తొలి బంతి నుంచే బౌలర్‌పై దాడి చేసేవాడు. అతను తన కెరీర్‌లో 104 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 49.34 సగటుతో 8586 పరుగులు చేశాడు. అదే సమయంలో అతను 251 వన్డేల్లో 8273 పరుగులు చేశాడు. ఇది కాకుండా 19 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడి 145.38 స్ట్రైక్ రేట్‌తో 394 పరుగులు చేశాడు.