Site icon HashtagU Telugu

Sehwag: పంత్, పృథ్వీషాలపై సెహ్వాగ్ ప్రశంసలు

Virendra

Virendra Sehwag

ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్, ఆ జట్టు యువ ఓపెనర్ పృథ్వీ షాలపై టీంమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. విధ్వంసకర ఆట తీరుతో చెలరేగే వీరిద్దరూ భారత క్రికెట్ జట్టులో ఉంటే టీమిండియా టెస్టు క్రికెట్‌ను శాసించడం ఖాయమని తెలిపాడు. తాజాగా ఓ క్రీడా కార్యక్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ వీరిద్దరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ ,పృథ్వీ షా ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లు.. వీరిద్దరూ టెస్టు క్రికెట్‌లోని అసలైన వినోదాన్ని అభిమానులకు అందించగలరు.

దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేసే వీళ్లిద్దరూ తుది జట్టులో ఉంటే టీమిండియా ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా ఎదుగుతుంది. అలాగే కచ్చితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ టైటిల్ కూడా సాధిస్తుంది. వీరిద్దరూ తుది జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్టు 400 స్కోరు కంటే ఎక్కువ చేయాల్సి ఉంటుందన్నాడు. ఇక పృథ్వీ షాకు జోడిగా టెస్టుల్లో రిషబ్ పంత్ ఓపెనర్ గా బరిలోకి దిగితే రికార్డులు బద్దలవ్వడం ఖాయమని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అండర్‌-19 ప్రపంచ కప్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్‌ ఐపీఎల్‌లోనూ కొన్ని మ్యాచ్‌లోనూ ఓపెనర్‌గా రాణించాడు. పంత్ ఇప్పటివరకు 30 టెస్టుల్లో 1920 పరుగులు సాధించాడు. అలాగే 24 వన్డేల్లో 715 పరుగులు 43 టీ 20ల్లో 683 పరుగులు సాధించాడు.

ఇక పృథ్వీ షా చివరిసారిగా ఆస్ట్రేలియా టూర్ లో జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు 5 టెస్టులాడిన పృథ్వీ షా 339 పరుగులు చేయగా.. 6 వన్డేల్లో 189 పరుగులు సాధించాడు.

Exit mobile version