Site icon HashtagU Telugu

Emotional Kohli: సీ యు నెక్స్ట్ సీజన్‌.. విరాట్ కోహ్లీ యొక్క భావోద్వేగ సందేశం

Virat Kohli

Virat Kohli

ఐపీఎల్ క్వాలిఫైయ‌ర్ 2లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై ఓట‌మి త‌రువాత ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన సమయంలో కోహ్లీ కేవలం ఏడు పరుగులకే ఔటయ్యాడు.
“కొన్నిసార్లు మీరు గెలుస్తారు.. కొన్నిసార్లు మీరు గెలవలేరు.. త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన  మేనేజ్‌మెంట్‌కు, సహాయక సిబ్బందికి ఈ అద్భుతమైన ఫ్రాంచైజీలో భాగమైన వ్యక్తులందరూ  వచ్చే సీజన్‌లో కలుద్దాం” అని కోహ్లి పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు. 33 ఏళ్ల కోహ్లీ 16 మ్యాచ్‌లలో రెండు అర్ధ సెంచరీలతో సహా కేవలం 341 పరుగులు మాత్రమే చేయగలిగాడు . మాజీ భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రితో సహా పలువురు మాజీ క్రికెటర్లు, కోహ్లీ ని క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని అన్నారు. జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతి లభించింది.
https://twitter.com/imVkohli/status/1530542487856484352