Saudi Arabia T20 : సౌదీ అరేబియా అనగానే మనకు పెట్రో డాలర్ గుర్తుకు వస్తుంది. లెక్కలేనంత ముడి చమురును ప్రపంచ దేశాలకు అమ్మేసి అంతులేని అమెరికా డాలర్లను ఈ దేశం కూడబెట్టింది. ఆ డబ్బుతో టీ20 లీగ్ వ్యాపారాన్ని శాసించేందుకు సౌదీ బరిలోకి దిగుతోంది. ఏకంగా రూ.4,300 కోట్లతో ప్రత్యేక టీ20 లీగ్‌ను నిర్వహించాలని సౌదీ సర్కారు యోచిస్తోంది. దీని నిర్వహణకు సంబంధించిన కొత్త వివరాలు బయటికి వచ్చాయి. అవేంటో చూద్దాం..
Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మార్చి 16 నుంచి 22 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
సౌదీ టీ20 లీగ్ గురించి..
- సౌదీ అరేబియా(Saudi Arabia T20) టీ 20 లీగ్‌ను టెన్నిస్ గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్ తరహాలో నిర్వహించనున్నారట.
- ఈ మెగా టోర్నమెంటులో 8 టీమ్‌లు మాత్రమే పాల్గొంటాయట.
- ఏడాది వ్యవధిలో నాలుగు వేర్వేరు దేశాల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందట.
- సౌదీ అరేబియా టీ 20 లీగ్‌ను ఆ దేశానికి చెందిన ఎస్‌ఆర్‌జే స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ నిర్వహించనుంది. దీనికి డ్యానీ టౌన్ సెండ్ సారథ్యం వహిస్తారు. ఈయన గతంలో ఏ-లీగ్‌కు సీఈఓగా సేవలు అందించారు. ఏ-లీగ్ అనేది ఆస్ట్రేలియాలో ప్రఖ్యాత సాకర్ టోర్నమెంట్.
- లీగ్ టోర్నమెంట్ల నిర్వహణలో డ్యానీ టౌన్ సెండ్‌కు అపార అనుభవం ఉంది. అందుకే ఆయనకు ఎస్‌ఆర్‌జే స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ సారథ్య బాధ్యతలు అప్పగించారు.
- తాము ఏర్పాటు చేసే టీ20 లీగ్ గురించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో ప్రస్తుతం ఎస్‌ఆర్‌జే స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ లీగ్‌లో చేరే దేశాల క్రికెట్ బోర్డులు, ప్రసార సంస్థలతో ఆదాయ పంపిణీ.. టోర్నీల నిర్వహణ షెడ్యూల్‌లో క్లాష్ రాకుండా చూడటంపై డిస్కషన్ నడుస్తోందట.
- ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్‌లో మంచి పలుకుబడి కలిగిన ప్రముఖ క్రికెట్ ఆల్ రౌండర్ నీల్ మ్యాక్స్‌వెల్ సలహాలను కూడా ఎస్‌ఆర్‌జే స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకుంటోందని సమాచారం.
Also Read :Lex Fridman : ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసిన లెక్స్ ఫ్రిడ్‌మన్.. ఎవరు ?
- భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలే సౌదీ టీ20 లీగ్ నిర్వహణలో ప్రధాన వేదికలుగా ఉంటాయని తెలిసింది. ఎందుకంటే ఎక్కువ క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నది ఈ దేశాల్లోనే. క్రికెట్‌కు ఎక్కువ ఆదాయాన్ని పండిస్తున్నదీ ఈ దేశాలే.
- భారత్‌లో జరిగే ఐపీఎల్, ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్‌ల షెడ్యూల్‌తో క్లాష్ రాకుండా, సమన్వయంతో ముందుకు వెళ్లాలని సౌదీ భావిస్తోందట.
- పురుషుల క్రికెట్‌తో పాటు మహిళా క్రికెట్‌ను కూడా ప్రోత్సహించాలని సౌదీ అనుకుంటోందట.