గబ్బా టెస్టు (Gabba Test) ఇరు జట్లకు కీలకంగా మారడంతో టీమిండియా (Team India) తుది జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin), హర్షిత్ రాణా(Harshit Rana)లను జట్టు నుంచి తప్పించింది. వీళ్లిద్దరి ప్లేసులో రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్‌లను జట్టులోకి తీసుకుంది. ఇక గాయంతో రెండో టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియన్ ప్లేయర్ జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు అయితే ఆకాష్ దీప్ (Akash Deep) మాత్రం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడు.
బుమ్రా ఒక్కడే జట్టుకు ఆపద్భాంధవుడి పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆకాష్ కి మేనేజ్మెంట్ మంచి అవకాశం కల్పించింది. కానీ ఆకాష్ దీప్ అంచనాలను అందుకోలేకపోవడమే కాదు తన బౌలింగ్ తోనూ విమర్శలపాలయ్యాడు. అతని బౌలింగ్ చూసి పంత్ కోపంతో రగిలిపోయాడు. ఈ మ్యాచ్ లో ఆకాశ్‌దీప్ వేసిన ఓ బంతి పిచ్ వెలుపల ఆఫ్ స్టంప్ వైపు వెళ్లింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆ బంతిని ఆపేందుకు కష్టపడాల్సి వచ్చింది. పంత్ బంతి అందుకుని ఆకాష్ ని చూస్తూ కన్నెర్ర చేశాడు. అంపైర్ దానిని వైడ్ బాల్‌గా ప్రకటించాడు. గల్లీ క్రికెట్ ఆడుతున్నప్పుడు మనం దాన్ని ఇంటర్నేషనల్ వైడ్ గా చూస్తాం. కానీ ఆకాష్ దీప్ ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఇలా వైడ్ వేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ బంతికి ఆకాశ్‌దీప్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఆకాశ్‌దీప్ బౌలింగ్ పై వ్యాఖ్యాతలు కూడా సెటైర్లు పేల్చారు. కాగా ఈ మ్యాచ్ లో ఆకాష్ ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. 88 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి అద్భుత ఫామ్ లో ఉన్న అలెక్స్ కారీని అవుట్ చేయడంలో ఆకాశ్‌దీప్ సక్సెస్ అయ్యాడు. నిజానికి ఆకాష్ దీప్ విషయంలో గంభీర్ వ్యవహరించిన తీరుపై మొదట విమర్శలు వెల్లువెత్తాయి. ఆకాశ్‌దీప్ స్థానంలో హర్షిత్ రాణాకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. గంభీర్‌తో సన్నిహితంగా ఉండటం, కోల్‌కతా నైట్ రైడర్స్‌లో రాణా ఆడటమే దీనికి కారణమని కామెంట్స్ వినిపించాయి. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఈ ప్రశ్నలు మరింత తీవ్రంగా మారాయి. అడిలైడ్ టెస్టులో రాణాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. దీంతో ఆకాశ్‌దీప్‌కు బ్రిస్బేన్‌లో అవకాశం లభించింది.
Read Also : Local Body Reservations : ‘హైడ్రా’ చట్టానికి పచ్చజెండా.. ఇక ఐదేళ్లకోసారి ‘లోకల్ బాడీ’ రిజర్వేషన్లు మార్పు