Site icon HashtagU Telugu

IND vs ENG 5th Test: సర్ఫరాజ్ మరో భారీ ఇన్నింగ్స్,

IND vs ENG 5th Test

IND vs ENG 5th Test

IND vs ENG 5th Test: ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో 135/1 స్కోరు చేసింది. తొలి రోజు హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ రెండో రోజు పరుగుల వరద పారించాడు. ఫలితంగా సెంచరీతో కదం తొక్కాడు. ఈ టెస్ట్ ద్వారా గిల్ కూడా శతకంతో మెరిశాడు. రోహిత్ 162 బంతుల్లో 103 పరుగులు చేయగా, గిల్ 150 బంతులు ఎదుర్కొని 110 పరుగులు రాబట్టాడు.

దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం క్రీజులో నిలుచున్నారు. వీరిద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం పూర్తయింది. రెండో సెషన్‌లో రెండు వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ ఆ తర్వాత భారత బ్యాటర్లను కట్టడి చేయలేకపోతోంది. ఫలితంగా యువ ఆటగాళ్లు ఇంగ్లిష్ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. కాగా టీమిండియాలో సర్ఫరాజ్ పేరు మారుమ్రోగుతుంది. ఆడిన అరంగేట్రంలోనే భారీ ఇన్నింగ్స్ ఆడిన ఈ యువ క్రికెటర్ అదే ఆటను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఐదో టెస్టులో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బంతులతో పోటీపడుతూ పరుగులు రాబడుతున్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి సెంచరీ వైపుకు దూసుకెళ్తున్నాడు.

కాగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు ఇప్పటికే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 3-1 ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ టెస్టులో ఓడిన తర్వాత భారత జట్టు పునరాగమనం చేయడంతో పాటు తర్వాతి మూడు టెస్టుల్లోనూ వరుసగా విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

భారత్ జట్టు – యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్ జట్టు – జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ షోయబ్ బషీర్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

Also Read: Loans: రుణ‌గ్ర‌హీత‌ల‌లో మ‌హిళల వాటా ఎంతంటే..? దేని కోసం ఎక్కువ‌గా లోన్ తీసుకుంటున్నారంటే..?

Exit mobile version