Ranji Trophy : సెంచరీ తర్వాత సర్ఫరాజ్ ఎమోషనల్

ముంబై క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Sarfaraj

Sarfaraj

ముంబై క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. రంజీ ట్రోపీ 2022 సీజన్‌ లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన సర్ఫరాజ్‌ తాజాగా మరో శతకం సాధించాడు. బెంగళూరు వేదికగా మధ్య ప్రదేశ్‌తో జరుగున్న ఫైనల్‌ మ్యాచ్‌లో సర్ఫరాజ్ శతక్కొట్టాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఓపికతో బ్యాటింగ్‌ చేసిన సర్ఫరాజ్‌ 190 బంతుల్లో శతకం మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 38 బంతుల్లోనే రెండో ఫిఫ్టీని పూర్తిచేశాడు. మొత్తంగా 243 బాల్స్ ఎదుర్కొన్న సర్ఫరాజ్ 134 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేయగానే సర్ఫరాజ్ ఎమోషనల్ అయ్యాడు. భావోద్వేగాల్ని అనుచుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. సర్ఫరాజ్ ఎమోషనల్ వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. శిఖర్ ధావన్ తరహాలోనే సెంచరీ చేసిన ఆనందంలో తొడగొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు సర్ఫరాజ్. ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ 900 పరుగులు పూర్తచేశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో అతనికిది ఎనిమిదో సెంచరీ. మొదటి హాఫ్ సెంచరీి 152 బంతులాడిన సర్ఫరాజ్‌ తర్వాతి 50 పరుగులను మాత్రం కేవలం 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. సర్ఫరాజ్‌ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు , ఒక సిక్సర్‌ ఉన్నాయి. ఎంతో ఓపికగా బ్యాటింగ్‌ చేసి కీలక సమయంలో సెంచరీ సాధించిన సర్ఫరాజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్ లో సర్ఫరాజ్ ఖాన్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. సర్ఫరాజ్ సెంచరీతో ముంబై తొలి ఇన్నింగ్స్ లో 374 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

  Last Updated: 23 Jun 2022, 03:04 PM IST