WTC Final: బీసీసీఐపై ఫైర్ అవుతున్న సర్పరాజ్ ఖాన్ అభిమానులు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో మ్యాచ్ జరగనుంది

WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించి టీమ్ ఇండియా జట్టుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.

ఫామ్ లేమితో అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు కోల్పోయిన అజింక్యా రహానె ఈ మధ్య సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న రహానే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. జిడ్డు ఆటగాడు అనే ముద్ర నుంచి బయటకు వచ్చి సిక్సర్లు, బౌండరీలతో ఆకట్టుకుంటున్నాడు. ధోనీ నాయకత్వంలో రహానే మరింత పుంజుకున్నాడు. ప్రస్తుతం రహానే గురించి చర్చ జరుగుతుంది. సెలెక్టర్లు సైతం రహానే పై ఫోకస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో చోటు దక్కించుకున్నాడు. అయితే రహానే సెలెక్ట్ అవ్వడం, సర్ఫరాజ్ రిజెక్ట్ అవ్వడం హాట్ టాపిగ్ గా మారింది.

2021-22 రంజీలో 6 మ్యాచ్‌ల్లో 122.75 సగటుతో 982 పరుగులు మరియు 2022-23 సంవత్సరంలో 556 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్‌ను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జట్టులో చోటు కల్పించలేదు బీసీసీఐ. దీంతో సర్ఫరాజ్ ఖాన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు. సర్పరాజ్ రంజీలో కాకుండా ఐపీఎల్ పై ఫోకస్ పెడితే అతను కచ్చితంగా సెలెక్ట్ అయ్యేవాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఇండియా కోసం ఆడాలి అనుకుంటే ఐపీఎల్ లో ఆడితే చాలంటూ విమర్శిస్తున్నారు. మరికొందరైతే బీసీసీఐ సర్పరాజ్ ను పక్కన పెట్టాలని భావించింది. అందుకే రహానే ట్రాక్ లోకి వచ్చాడంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి రహానే రావడం సర్పరాజ్ సెలెక్ట్ కాకపోవడం విమర్శలకు దారి తీసింది.

గత మ్యాచ్ లను పరిశీలిస్తే.. విదేశీ గడ్డపై అజింక్యా రహానే ఆటతీరు బాగానే ఉండటం గమనార్హం. అదే సమయంలో ఇంగ్లిష్ పిచ్‌పై ఆడిన అనుభవం కూడా ఉంది. శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా అజింక్య రహానే వంటి సాంకేతికంగా మంచి బ్యాట్స్‌మెన్‌కు టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కడం ఆశ్చర్యమేమీ కాదు. కాగా.. ఐపీఎల్‌లో రహానే తన బ్యాట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టీమిండియా జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనకత్.

Read More: 60 Killed: దారుణం.. సైనికుల దుస్తులు ధరించి 60 మందిని హత్య