Site icon HashtagU Telugu

Sarfaraz Khan: సెలక్టర్లు ఫూల్స్ అనుకుంటున్నారా..? సర్ఫ్ రాజ్ ను పక్కన పెట్టడంపై బీసీసీఐ అధికారి

Sarfaraz Khan BCCI

Do You Think The Selectors Are Fools; Bcci Official On Sidelining Surf Raj

Sarfaraz Khan: వెస్టిండీస్ తో సిరీస్ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించారు. సీనియర్లతో పాటు పలువురు యువ ఆటగాళ్ళు కూడా జట్టులో చోటు దక్కించుకోగా.. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫ్ రాజ్ ఖాన్ (Sarfaraz Khan) ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ సెలక్షన్ కమిటీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పలువురు మాజీ ఆటగాళ్ళు కూడా సర్ఫ్ రాజ్ (Sarfaraz Khan) కు మద్ధతుగా నిలబడ్డారు. సెలక్టర్లు పరుగులు కాకుండా ఇంకేం చేస్తే ఎంపిక చేస్తారో అంటూ పలువురు ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు కూడా సంధించింది. మరోవైపు సర్ఫ్ రాజ్ కూడా బీసీసీఐ (BCCI) సెలక్టర్లకు కౌంటర్ ఇచ్చాడు. తనను ఎంపిక చేయకపోవడంపై పరోక్షంగా సెలక్టర్లకు చురకలు వేస్తూ ట్వీట్ చేశాడు. రంజీ ట్రోఫిలో తన బ్యాటింగ్ కి సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో జోడించాడు. క్యాప్షన్ మాత్రం ఏమి పెట్టకుండా… నా బ్యాటింగ్ చూడండి అని చెప్పకనే చెప్పాడు. గత మూడు సీజన్లు చూసుకుంటే సర్ఫరాజ్ సగటు 100 కి పైగానే ఉంది. ఇప్పటివరకు 34 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడిన సర్ఫరాజ్.. 3175 పరుగులు చేసాడు.

కాగా సర్ఫ్ రాజ్ ను ఎంపిక చేయకపోవడానికి కారణాలపై బీసీసీఐ (BCCI) అధికారి ఒకరు స్పందించారు. కేవలం బ్యాటింగ్ మాత్రమే ఉంటే సరిపోదని, ఫిట్ నెస్, ప్రవర్తన కూడా బావుండాలన్నారు. సర్ఫ్ రాజ్ (Sarfaraz Khan) ఫిట్ నెస్ అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్టుగా లేదన్నారు. అలాగే ఆన్ ది ఫీల్డ్ లో అతని ప్రవర్తన సరిగా లేదంటూ చెప్పుకొచ్చారు. ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేసేటప్పుడు ఆటతీరుతో పాటు అతని ఫిట్ నెస్ , ప్రవర్తన, క్రమశిక్షణ కూడా పరిగణలోకి తీసుకుంటారన్నారు. ఇకనైనా సర్ఫ్ రాజ్ కోచ్ అతని ఫిట్ నెస్ , ప్రవర్తనపై దృష్టి పెడతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాలంటే అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ గా ఉండాలని సూచించారు. అయితే బీసీసీఐ అధికారి కామెంట్స్ పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది,

Also Read:  Johnnie Moore: భారత్ నుండి అమెరికా చాలా నేర్చుకోవాలి: యూఎస్ మాజీ కమిషనర్