Gill-Sara Tendulkar: వరల్డ్ కప్ సమరంలో భాగంగా నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో కోహ్లీ మాత్రమే కాదు.. మరో ఇద్దరు ప్రత్యేకార్షణగా నిలిచారు. వారే టీమిండియా బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్, సారా టెండూల్కర్. స్టేడియంలో శుభమన్ గిల్ బౌండరీలు..సిక్సర్లు బాదుంతుంటే సారా కేరింతలు కొట్టింది. గ్యాలరీ లో కూర్చుని గిల్ తెగ ఎంకరేజ్ చేసింది.
అది చూసి గిల్ మరింత చెలరేగాడు. తొలుత గిల్ ఫోర్ కొట్టాడు..ఆ వెంటనే రెండు భారీ సిక్సులు బాదాడు. దీంతో సారా తన్మయానికి గురైంది. ముఖమంతా నవ్వుతో నింపోయింది. రెండు చేతులు జోడించి బిగ్గరగా చప్పట్లు కొట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సారా ఉత్సాహానికి నెటి జనులు ఫిదా అవుతున్నారు. గిల్ ని ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తుందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో ఈరోజు గిల్ సెంచరీ చేయడం ఖాయమనుకున్నారు. కానీ అర్దసెంచరీ సాధించిన తర్వాత ఔట్ అవ్వడంతో సారా కూడా నిరుత్సాహపడింది. అయ్యో అవుటైపో యాడే? సెంచరీ కొడితే బాగుండేదని ఫీలైంది. ప్రస్తుతం వీరిద్దరి శైలి క్రికెట్ అభిమానులే కాకుండా నెటిజన్స్ ను ఆకట్టుకుంది. సారాకు గిల్ అంటే ఎంత ప్రేమనో అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/BaklolArmy/status/1715068194782883911
Also Read: Rahul Gandhi – Kodandaram : రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్ కీలక ప్రకటన